కరోనా వైరస్ నివారణకు ప్రకృతి సహజ సిద్ధమైన నీరాను సేవించాలని... ప్రజలను తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి కోరింది. ఔషధ గుణాలున్న నీరాను ప్రతి ఒక్కరూ.. సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం నీరా చట్టం తీసుకురావడాన్ని హర్షిస్తూ... మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ బషీర్‌బాగ్ కూడలిలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్రపటాలకు నీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా పలువురికి నీరాను ఉచితంగా పంపిణీ చేశారు. ఇతర రాష్ట్రాల్లో నీరాను ఏ విధంగా సరఫరా చేస్తుందనే అంశంపై ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధ్యయనం చేసిందని... త్వరలోనే తెలంగాణలో నీరాను ప్రవేశపెడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మహారాష్ట్రకు కరోనా గండం- నాగ్‌పుర్‌లో 144 సెక్షన్