ETV Bharat / state

దిల్లీ లిక్కర్ స్కామ్.. గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ పిటిషన్ నిర్ణయం వాయిదా

Delhi Liquor Scam Latest Update: దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు బెయిల్​ పిటిషన్​పై కోర్టు నిర్ణయం రేపు రానుంది. ఇవాళ వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు ధర్మాసనం తీర్పును రేపు వెల్లడించనున్నట్లు తెలిపింది. ఈ కేసులో నిన్న ఐదుగురికి బెయిల్ మంజూరు అయింది.

Delhi Liquor Scam
Delhi Liquor Scam
author img

By

Published : Mar 1, 2023, 8:27 PM IST

Delhi Liquor Scam Latest Update: దిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు ఎన్నో మలుపులు, కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులు అరెస్టు అయ్యారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం విదితమే. అయితే తాజాగా గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ పిటిషన్​పై నిర్ణయం రేపటికి వాయిదా పడింది.

సీబీఐ కోర్టు బుచ్చిబాబు బెయిల్ పిటిషన్​పై నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు రేపు మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో బుచ్చిబాబుకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ అరెస్టు చేసిన బుచ్చిబాబుకు 14 రోజుల కస్టడీని పొడిగించారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని సీబీఐ.. కోర్టును కోరింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు కస్టడీ పొడిగించింది. తదుపరి విచారణను ఈ నెల 9 వ తేదీకి వాయిదా వేసింది.

ప్రశ్నించేందుకు అనుమతి పొందిన ఈడీ : దిల్లీ మద్యం స్కామ్ కేసులో ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఆయన పాత్ర ఉందని.. హైదరాబాద్​కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహారించారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఆయనను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వద్ద గోరంట్ల బుచ్చిబాబు ఆడిటర్​గా పనిచేశారు. ఇటీవల బుచ్చిబాబును ప్రశ్నించేందుకు ఈడీ అనుమతి పొందింది.

ఐదుగురికి బెయిల్ మంజూరు : మంగళవారం ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరైంది. రౌస్ అవెన్యూ కోర్టు మద్యం కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. కల్దీప్​సింగ్, నరేంద్రసింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, సమీర్ మహేంద్రు, ముత్తా గౌతమ్​లకు బెయిల్ మంజూరు అయింది. వీరిలో కల్దీప్​సింగ్, నరేంద్రసింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ముత్తా గౌతమ్​లు అరెస్టు కాకుండానే సాధారణ బెయిల్ వచ్చింది. పై వారిలో అరుణ్​ పిళ్లైను ఇటీవల ఈడీ ప్రశ్నించింది. ఈడీ నమోదు చేసిన కేసులో గౌతమ్ మినహా మిగతావారు జ్యుడీషియల్ రిమాండ్​లో ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.