మార్కెట్లో నిత్యావసరాలను కొనడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు విదేశీయులను పోలినట్లు ఉన్నారని.. వారని సూపర్ మార్కెట్లోకి అనుమతించని ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని స్టార్ సూపర్ మార్కెట్లో సరుకులు కొనడానికి మణిపూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు వచ్చారు. విదేశీయులను పోలినట్లు ఉన్నారని సూపర్ మార్కెట్ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని, స్టోర్ కీపర్‌ను అరెస్టు చేశారు. బాధితులు సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ విద్యార్థులకు ఒక నెలకు సరిపోయే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం