ETV Bharat / state

ఘనంగా  గోల్కొండ అమ్మవారి బోనాలు - బోనాలు

గోల్కొండ అమ్మవారి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్​ ఇబ్బందులు లేకుండా వాహనాలను దారి మళ్లించనున్నారు.

ఘనంగా సాగుతోన్న గోల్కొండ అమ్మవారి బోనాలు
author img

By

Published : Jul 11, 2019, 5:12 AM IST

Updated : Jul 11, 2019, 7:52 AM IST

ఘనంగా సాగుతోన్న గోల్కొండ అమ్మవారి బోనాలు

గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఇవాళ కూడా బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకున్నారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. రాందేవ్‌గూడ, గోల్కొండ కోట, మక్కాయి దర్వాజ, ఫతే దర్వాజ, బంజారా దర్వాజ తదితర ప్రాంతాల్లో వాహనాలను మళ్లించనున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: నిండుకుండలా మేడిగడ్డ... అన్నారంకు గోదారమ్మ

Intro:అంబర్పేట్ లోని శ్రీ మహంకాళీ ఆలయంలో బోనాల ఉత్సవాలు ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశాలు జరిపారు

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గోల్కొండ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రదానంగా హైదరాబాద్ జంట నగరాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా బ్రహ్మాండంగా జరిగినటువంటి జాతర కాబట్టి బోనాల జాతరకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది మన ట్రెడిషన్ మన సంస్కృతి సంప్రదాయాలు ఈ పండుగ విశ్వవ్యాప్తమై ఈ దేశమే కాదు ప్రపంచమంతా జరుగుతున్నటువంటివి కాబట్టి ఇ అందుకు సంబంధించి ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశారు మన ముఖ్యమంత్రి గారు.. అంతేకాకుండా ఈ దేశంలో ఎక్కడా లేదు దేవాలయాలకు డబ్బులు ఇచ్చే సంప్రదాయం కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వడానికి కి మరియు రెండోది ఖర్చుల నిమిత్తం 100 కోట్లు ఖర్చు పెడుతున్నది ..దానికి సంబంధించి ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లో సమీక్షా సమావేశాలు జరుగుతున్నాము..
మహిళలు బోనాలు చాలా నిష్ఠగా చేస్తారు బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరగాలని పండగ కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించాలని కోరారు ఈ రోజు మా ఎమ్మెల్యే వెంకటేష్ గారు కార్పోరేట్ ముఖ్యనాయకులు పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నాయకులు అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కూడా ఏ ఇబ్బందులు ఎదురవకుండా ప్రశాంతంగా పండగ జరగాలనేది ప్రభుత్వ లక్ష్యం
బైట్: తలసాని శ్రీనివాస్ యాదవ్ (మంత్రి)

Body:విజేందర్ అంబరుపేట

Conclusion:8555855674
Last Updated : Jul 11, 2019, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.