హైదరాబాద్ బాలానగర్ పరిధిలో బంగారు ఆభరణాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మహారాష్ట్రకు చెందిన రాహుల్‌గా గుర్తించారు. జల్సాలకు అలవాటు వ్యక్తి.... కస్టమర్‌గా ఆభరణాల దుకాణాలకు వెళ్లి బంగారు ఆభరణాలు చూపించమని కోరతాడు. అనంతరం వాటిని ధరించి పారిపోయాడు.
సనత్‌నగర్, మేడ్చల్ పీఎస్ పరిధిల్లో దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలానగర్ ఎస్వోటీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.