గోకుల్ ఛాట్, లుంబినీ పార్కు బాంబు పేలుళ్లు జరిగి 13 ఏళ్లు పూర్తైన సందర్భంగా బాంబు పేలుళ్ల బాధితులు మృతులకు నివాళులు అర్పించారు. పేలుళ్ల ధాటికి గాయపడిన క్షతగాత్రులు అవయవాలు కోల్పోయి నరకయాతన అనుభవిస్తున్నారని, పేలుళ్లు జరిగి పదమూడు సంవత్సరాలు గడచినా బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయలేదని బాధితుడు సయ్యద్ రహీమ్ ఆవేదన వ్యక్తం చేశారు. పేలుళ్లకు పాల్పడిన దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ