ETV Bharat / state

Grmb Sub-Committee Meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం - గెజిట్​ అమలుపై జీఆర్​ఎంబీ ఉపసంఘం భేటీ

grmb
grmb
author img

By

Published : Sep 20, 2021, 12:30 PM IST

Updated : Sep 20, 2021, 12:48 PM IST

12:25 September 20

గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం

 గెజిట్​ నోటిఫికేషన్​ అమలు కార్యాచరణపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం (godavari Sub-Committee) సమావేశమైంది. హైదరాబాద్​లోని జలసౌధలో జీఆర్​ఎంబీ ఉపసంఘం (Grmb Sub-Committee) భేటీ అయింది. బోర్డు సభ్య కార్యదర్శి బి.పి.పాండే (bp pandey) నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా గెజిట్ అమలుపై జీఆర్‌ఎంబీ ఉపసంఘం చర్చించనుంది.  

ఈ అంశాలపై ప్రధానంగా చర్చించవచ్చు..!

      జీఆర్ఎంబీ సభ్యకార్యదర్శి బీపీ పాండే కన్వీనర్​గా ఏర్పాటు చేసిన కమిటీలో బోర్డు సభ్యులు ఇద్దరు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతర్రాష్ట్రాల వ్యవహారాల చీఫ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ, ఏపీ జెన్​కో  అధికారులు కూడా ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. గెజిట్ నోటిఫికేషన్ (Gazette notification)​లోని అంశాల అమలు కార్యాచరణ, అందుకు సంబంధించిన అంశాలపై ఉపసంఘం సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రాజెక్టుల నిర్వహణా విధానం, ఉద్యోగులు, సిబ్బంది, వనరులు, సీఐఎస్ఎఫ్ భద్రత కోసం వసతి సహా ఇతర క్లాజులపై సమావేశంలో చర్చ జరగనుంది. అందుకు అవసరమైన డాక్యుమెంట్లతో ఉపసంఘం సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ట్రాల సభ్యులను గోదావరి నదీ యాజమాన్య బోర్డు కోరింది.

 ఉపసంఘం ఏర్పాటు

    కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం ఇదివరకే గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన జీఆర్ఎంబీ(grmb) , కేఆర్ఎంబీ(KRMB) సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ స్థానంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.  బోర్డు మీటింగ్ మినిట్స్​తో పాటు ఉపసంఘాన్ని ప్రకటించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి ఉపసంఘానికి కన్వీనర్​గా వ్యవహరిస్తారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై ఉపసంఘం ఎప్పటికప్పుడు చర్చించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఇదీ చూడండి: GRMB: గోదావరి యాజమాన్య బోర్డు ఉపసంఘం ఏర్పాటు

Last Updated : Sep 20, 2021, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.