భాగ్యనగరంలో బక్రీద్ వ్యాపారం జోరందుకుంది. పండుగలో భాగంగా ఖుర్బానీ(దేవుడికి బలిదానం) ఇవ్వటం ముస్లింల ఆనవాయితీ. దీనికోసం వ్యాపారులు పొట్టేళ్లు, మేకలను సిద్ధం చేయడం వల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. టోలీచౌకీ తదితర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపుల షెడ్లలో వ్యాపారం జరుగుతోంది. నగరంలో మేకల, గొర్రెలకు డిమాండ్‌కు కావాల్సిన ఉత్పత్తి తెలంగాణలో లేదని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. పండుగ ముందు రోజు రాత్రి కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి :నాన్నపై ప్రేమతో.. శవం ముందే వివాహం!