హైదరాబాద్ మహానగరంలో 201 బస్‌షెల్టర్‌లను నిర్మించుటకు 4ప్యాకేజీల కింద టెండర్లు పిలిచేందుకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదించింది. గురువారం నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 33ఎజెండా అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది.
నగరంలోని 221 జంక్షన్లలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ కాంట్రాక్ట్‌ను పొడిగించుటకు.... అలాగే కొత్తగా 155 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయుటకు కమిటీ అంగీకరించింది.
రోడ్డు విస్తరణకు ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ వద్ద సేకరించిన దేవాలయ ఆస్తులతోపాటు షాపులు కోల్పోయిన వారికి వనస్థలిపురంలో కొత్తగా నిర్మించిన మోడల్ మార్కెట్‌లో టెండర్ ప్రక్రియలో షాపులు కేటాయించాలని కమిటీ ఆమోదించింది. ఈ సమావేశంలో ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ తోపాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.