ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం అందించే 'ఫీడ్ ద నీడ్' కార్యక్రమాన్ని విస్తృతం చేయనున్నారు. నగరంలోని హోటల్ యజమానులతో బల్దియా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో 15శాతం ఆహార పదార్థాలు వ్యర్థమవుతున్నాయి. ఇంతటి భారీ స్థాయిలో ఆహారం వృథా కాకుండా ఆకలితో అలమటిస్తున్న వారికి అందించాలని "ఫీడ్ ద నీడ్" కార్యక్రమం చేపడుతున్నామని దానకిషోర్ తెలిపారు.
శిల్పారామం, జూబ్లీ చెక్ పోస్ట్ సర్కిల్ వద్ద ఆహార పదార్థాలను నిల్వ ఉంచడానికి రిఫ్రిజిరేటర్స్ను ఏర్పాటు చేశామన్నారు. ఆహారాన్ని తనిఖీ చేసిన తరువాత అందిస్తామన్నారు. ఫ్రిజ్లు లేకుండా అన్నార్థులకు ఆహారం చేర్చడమే లక్ష్యమని కమిషనర్ వెల్లడించారు.