ETV Bharat / state

ఫిర్యాదుల కోసం ఆన్​లైన్​ వేదికలే ఉపయోగించుకోండి: జీహెచ్​ఎంసీ - జీహెచ్​ఎంసీ కాల్​ సెంటర్​

జీహెచ్​ఎంసీ పరిధిలో కొవిడ్​ కేసులు భారీగా వస్తున్నందున బల్దియా పలు చర్యలకు పూనుకుంది. కార్యాలయానికి సందర్శకులకు పాక్షిక ఆంక్షలతో పాటు, ఫిర్యాదుల కోసం ఆన్​లైన్​ వేదికలు ఉపయోగించుకోవాలని నగర ప్రజలకు సూచించింది.

హైదరాబాద్​ ప్రజల కోసం జీహెచ్​ఎంసీ చర్యలు
హైదరాబాద్​ వార్తలు
author img

By

Published : Apr 28, 2021, 7:08 AM IST

హైదరాబాద్​ నగరంలోని పలు సమస్యలపై ఆన్​లైన్, మై-జీహెచ్ఎంసీ యాప్, కంట్రోల్ రూంలకు అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జీహెచ్​ఎంసీ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. నగరవాసులు తమకు సంబంధించిన సమస్యలను జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకురావడానికి 8 రకాలైన విధానాలున్నాయని... మై జీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ వెబ్​సైట్, జీహెచ్ఎంసీ కాల్ సెంటర్, డయల్ 100, ఎమర్జెన్సీ కాల్ సెంటర్, జీహెచ్ఎంసీ ట్విట్టర్, ప్రజావాణి, వార్త పత్రికల క్లిపింగ్​లు, కమిషనర్ పేషీ ద్వారా ఫిర్యాదులు అందచేయవచ్చని జీహెచ్ఎంసీ తెలిపింది.

నగరంలో కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా.. ప్రత్యేకంగా కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసినట్లు బల్దియా పేర్కొంది. కాల్​సెంటర్​కు ఏప్రిల్ 1నుంచి 27 వరకు 563 ఫిర్యాదులు అందాయి. వీటిలో 133 కొవిడ్ కిట్​లకు సంబంధించినవి కాగా... 292 కాల్స్ నగరంలో వాక్సినేషన్, కరోనా పరీక్ష కేంద్రాలకు సంబంధించినవి. 43 ఫోన్లు కొవిడ్​ మృతుల దహనాలు గురించి, అంబులెన్స్​ సేవలు తదితరవాటికోసం వచ్చాయి.

2021 జనవరి 1నుంచి ఏప్రిల్ 27 వరకు జీహెచ్​ఎంసీకి 91,530 ఫిర్యాదులు అందగా 73,751 సమస్యలను పరిష్కరించారు. పారిశుద్ధ్య, రోడ్ల మరమ్మతులు, వెటర్నరీ విభాగానికి సంబంధించి అత్యధిక ఫిర్యాదులు వచ్చాయి. అయితే దీర్ఘకాలిక పనులు, వివిధ శాఖలతో ముడిపడి ఉన్న పనులు, పెద్ద ఎత్తున నిధులు అవసరమయ్యే 17వేలకు పైగా ఫిర్యాదులు పెండింగ్​లో ఉన్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. కాగా వీటిలో చాలావరకు పరిష్కారం అయినా... సంబంధింత ఫిర్యాదుదారు మూసివేయలేదని పేర్కొంది. వీటి విషయమై ఫిర్యాదుదారుడిని సంప్రదించి వారి స్పందన తెలుసుకునే విధానాన్ని ప్రవేశ పెట్టారు.

ఇదీ చూడండి: ప్రాణవాయువు పుష్కలం.. అందుబాటే దుర్భలం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.