ETV Bharat / state

జీహెచ్‌ఎంసీ మ్యుటేషన్​ రుసుముతో ప్రజలకు పరేషాన్​.. - హైదరాబాద్ తాజా వార్తలు

Mutation Problems: హైదరాబాద్ జీహెచ్​ఎంసీ పరిధిలోని స్థిరాస్తి బదిలీ ప్రకియలో సాంకేతిక అవాంతరాలు ప్రజలకు ఇబ్బందులుగా మారాయి. మ్యుటేషన్ కోసం మీ సేవలో రుసుము చెల్లించినా ఆన్​లైన్​లో నమోదు కాకపోవడంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జీహెచ్​ఎంసీ
జీహెచ్​ఎంసీ
author img

By

Published : Jul 6, 2022, 8:23 AM IST

Mutation Problems: జీహెచ్‌ఎంసీ పరిధిలోని స్థిరాస్తి బదిలీ ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు ప్రజలకు తలనొప్పిగా మారాయి. మ్యుటేషన్ రుసుము మీ సేవలో చెల్లించినప్పటికీ ఆన్‌లైన్‌లో సాంకేతికమైన అవాంతరాలతో ఆ ప్రక్రియ అర్దాంతరంగా నిలిచిపోతుంది. తిరిగి అంతే రుసుము చెల్లించేలా చూపిస్తుండటంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మ్యుటేషన్ చెల్లించిన రశీదులు ఉన్నప్పటికీ చెల్లించిన రుసుము వివరాలు అన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

కొనుగోలు చేసిన స్థిరాస్తిని తమ పేరున బదిలీ చేసుకోవడానికి మ్యుటేషన్ రుసుము చెల్లించినప్పటికీ.. మీసేవలో మళ్లీ రుసుము చెల్లిస్తేనే పేరు మార్పిడి జరుగుతుందని చూపిస్తుండటంతో వారికి దిక్కుతోచటం లేదు. ఒక్క స్థిరాస్తి విషయంలోనే కాకుండా భూముల క్రయ విక్రయాల్లో ఇదే తంతు జరుగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. సెల్ఫ్‌ మ్యూటేషన్ చేసుకునే విధానంలో భాగంగా మొదటి వ్యక్తి పేరు ఉన్నప్పటికి మరోకరి పేరు ఆన్​లైన్​లో వస్తుందని.. ఈ లోపాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని బాధితులు అంటున్నారు.

శేరిలింగంపల్లి పరిధిలోని గోపన్‌పల్లిలో అజయ్‌ అనే వ్యక్తి విల్లా కొనుగోలు చేశారు. ఆ విల్లాను రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే తన పేరున మ్యుటేషన్ కావడానికి రూ.38 వేల రుసుమును చెల్లించారు. మీ సేవలో మ్యూటేషన్ నమోదు చేసుకోవడానికి వెళ్లితే మళ్లీ ఫీజు చెల్లించాలని చూపించడంతో అతను ఖంగుతిన్నాడు. మీ సేవ నిర్వాహకులకు తాను ఇప్పటికే చెల్లించానని రశీదు చూపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆన్​లైన్​లో తలెత్తిన సాంకేతికపరమైన లోపం కారణంగా ఇది జరిగిందని జీహెచ్‌ఎంసీ పన్నుల శాఖాధికారులు గుర్తించినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే లోపాలను సవరించి తమకు న్యాయం చేయాలని అజయ్ కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.