ETV Bharat / state

LED lights on ORR:ఎల్ఈడీ కాంతులతో వెలిగిపోనున్న ఓఆర్ఆర్... - తెలంగాణ తాజా సమాచారం

LED lights on outer ring road: బాహ్యవలయ రహదారి త్వరలోనే పూర్తిస్థాయిలో ఎల్ఈడీ దీప కాంతుల్లో(LED lights on ORR) వెలిగిపోనుంది. ఇప్పటికే కొంత మేర ఎల్ఈడీ బల్బులు ఉండగా వచ్చే నెలలో ఓఆర్ఆర్ మొత్తం అందుబాటులోకి రానున్నాయి. అటు జీహెచ్ఎంసీ సహా పట్టణ ప్రాంతాల్లో ఎల్ఈడీ బల్బులతో ఇంధనం, డబ్బు పెద్దమొత్తంలో ఆదా అవుతోందనడానికి పురపాలకశాఖ గణాంకాలు నిదర్శనమని గ్రేటర్ హైదరాబాద్ అధికారులు తెలిపారు.

LED lights on ORR
LED lights on ORR
author img

By

Published : Nov 26, 2021, 11:54 AM IST

ఇంధనం పొదుపుతో పాటు ఆర్థికభారం తగ్గించుకోవడంలో భాగంగా రాష్ట్రంలో వీధిదీపాలకు ఎల్ఈడీ బల్బులు(LED lights ) ఏర్పాటు చేసే కసరత్తు గత కొన్నాళ్లుగా జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పరిధిలోని వీధిదీపాలకు 4 లక్షల 92 వేల ఎల్ఈడీ బల్బులు అమర్చారు. 2017 నుంచి ఈ ఎల్ఈడీ బల్బులతో 487.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయినట్లు పురపాలకశాఖ వర్గాలు తెలిపాయి. ఎల్ఈడీ బల్బుల(LED lights on ORR ) ఏర్పాటుకు ముందు విద్యుత్ బిల్లు నెలకు రూ. 14.94 కోట్లు ఉంటే... ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు తర్వాత రూ. 8.5 కోట్లు మాత్రమే వస్తున్నట్లు పేర్కొన్నాయి. దీంతో 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా రూ. 250 కోట్లు ఆదా అయినట్లు అంచనా వేస్తున్నారు. అటు 4.06 టన్నుల కర్బన ఉద్ఘారాలు తగ్గినట్లు జీహెచ్ఎంసీ(GHMC latest news) అధికారులు తెలిపారు.

ఎల్ఈడీ కాంతులతో వెలిగిపోనున్న ఓఆర్ఆర్

తగ్గిన ఆర్థికభారం..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC news ) తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర కార్పొరేషన్లలో, మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మినహా ఇతర పట్టణాల్లో 9 లక్షల వరకు ఎల్ఈడీ బల్బులు అమర్చారు. దాంతో పెద్దమొత్తంలో విద్యుత్ ఆదా కావడంతో పాటు పురపాలికలపై ఆర్థికభారం తగ్గిందని చెప్తున్నారు. ఇతర పట్టణాలపై ఏడాదికి రూ. 81 కోట్ల మేర భారం తగ్గుతుందని అంటున్నారు.

హైదరాబాద్ చుట్టూ ఉన్న బాహ్యవలయ రహదారికి సైతం త్వరలో పూర్తిస్థాయిలో ఎల్ఈడీ వెలుగులు(LED lights arrangement on ORR) రానున్నాయి. ఓఆర్ఆర్ పై ఇప్పటికే 24 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. మిగిలిన 130 కిలోమీటర్ల మేర కూడా ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు(LED bulbs on the outer ring road ) చేస్తున్నారు. వంద కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు త్వరలో పూర్తి కానుంది. కొత్త సంవత్సరం లోపు ఓఆర్ఆర్ పూర్తిగా ఎల్ఈడీ వెలుగులను పరుచుకోనున్నట్లు సమాచారం. దీంతో భారీగా విద్యుత్ ఆదా కావడంతో పాటు హెచ్ఎండీఏపై ఆర్థికభారం కూడా తగ్గనుంది.

ఎలాంటి ఖర్చు లేకుండా నిర్వహణ..

గతంలో వీధి దీపాలను వెలిగించడం, ఆర్పివేయడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడా అవసరం లేకుండా వాటంతట అవే ఆరిపోయే వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఈ కారణంగా పట్టపగలే వెలిగే విద్యుద్దీపాల ఖర్చు ఆదా అవుతోంది. ఒకప్పుడు వీధి దీపాలు చెడిపోతే మరమ్మతులు చేయడానికి, కొత్తవి అమర్చేందుకు భారీగా ఖర్చు చేసేవాళ్లు. ఇప్పుడా అవసరం లేకుండా.. వీధి దీపాలను నిర్వహిస్తున్న సంస్థే చెడిపోయిన వాటిని తీసేసి కొత్తవి అమర్చుతోంది. ఆగిపోయిన విద్యుత్​ దీపాలను 48 గంటల్లో పునరుద్ధరిస్తోంది. ఫలితంగా ఎలాంటి ఖర్చు, శ్రమ, మానవ వనరుల అవసరం లేకుండా వీధి దీపాల నిర్వాహణ సాఫీగా సాగుతోంది.

ఇదీ చదవండి:katrina kaif marriage: పెళ్లికి రండి.. వాటిని మాత్రం తీసుకురాకండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.