ETV Bharat / state

కరెంట్​ పోతోంది... జనరేటర్​ వేయండి: జీహెచ్​ఎంసీ మేయర్​

విద్యుత్​ అంతరాయం లేకుండాా తన కార్యాలయంలో జనరేటర్​ను ఏర్పాటు చేయాలని జీహెచ్​ఎంసీ కమిషనర్​ను మేయర్​ విజయలక్ష్మి లేఖ రాశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో ట్రోల్ అవడంతో ఆమె వివరణ కూడా ఇచ్చారు. తన ఇంటి వద్ద విద్యుత్ లైన్ల పనులు జరుగుతున్నాయని... తవ్వకాల వల్ల విద్యుత్‌కు అంతరాయం కలుగుతోందని మేయర్​ వివరించారు. నగరంలో విద్యుత్ కోతలు ఉన్నాయని తాను చెప్పలేదని మేయర్‌ స్పష్టం చేశారు.

కరెంట్​ పోతోంది... జనరేటర్​ ఇవ్వండి: జీహెచ్​ఎంసీ మేయర్​

author img

By

Published : Mar 5, 2021, 4:38 PM IST

Updated : Mar 5, 2021, 7:02 PM IST

జీహెచ్ఎంసీ కార్యాలయంలో విద్యుత్ అంతరాయంపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి..కమిషనర్ లోకేష్ కుమార్​కు లేఖ రాశారు. బంజరాహిల్స్​లోని తన క్యాంప్ కార్యాలయంలో తరచుగా విద్యుత్ అంతరాయం అవుతోందని మేయర్ లేఖలో పేర్కొన్నారు.

విద్యుత్ అంతరాయం వల్ల రోజువారి ఆఫీస్ కార్యకలాపాలకు ఇబ్బంది అవుతోందని మేయర్ వెల్లడించారు. తన క్యాంప్ కార్యాలయంలో వెంటనే 25కేవీ జనరేటర్ ఏర్పాటు చేయాలని మేయర్ కమిషనర్​ను కోరారు.

విద్యుత్​ కోతలు ఉన్నాయని చెప్పలేదు: మేయర్​

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేఖపై మేయర్​ గద్వాల విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. తన ఇంటి వద్ద విద్యుత్ లైన్ల పనులు జరుగుతున్నాయని... తవ్వకాల వల్ల విద్యుత్‌కు అంతరాయం కలుగుతోందని మేయర్​ వివరించారు. అందుకే తాత్కాలికంగా జనరేటర్ ఏర్పాటు చేయాలని కోరానని ఆమె స్పష్టత ఇచ్చారు. నగరంలో విద్యుత్ కోతలు ఉన్నాయని తాను చెప్పలేదని మేయర్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'బాబ్లీ కోసం పోరాడినట్లే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడతాం'

Last Updated : Mar 5, 2021, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.