కరోనా మహమ్మారి కట్టడికి ఫ్రంట్లైన్ వారియర్లుగా పనిచేస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ఇమ్మ్యూనిటీ మెడికల్ కిట్లను అందజేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 500 మందికి ఇమ్మ్యూనిటీ పెంపు మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. ప్రాజెక్ట్ హోప్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో అందజేసిన ఈ మెడికల్ కిట్లలో డీ విటమిన్, జింక్, పారాసిటమాల్ మాత్రలు శానిటైసర్, మాస్కులు ఉన్నాయి.
గ్రేటర్ మునిస్పల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఇప్పటికే దాదాపు 95 శాతం సిబ్బందికి వాక్సినేషన్ పూర్తిచేశామని అన్నారు. సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ఆనందయ్య మందు.. కోటయ్య మృతి