హైదరాబాద్ ఎల్బీనగర్ షైన్ ఆసుపత్రి ఘటనపై విచారణ మొదలు పెట్టినట్లు జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ సంచాలకులు విశ్వజిత్ తెలిపారు. అగ్నిప్రమాదంపై 3 నెలల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. ప్రాథమిక విచారణలో ఆసుపత్రి వాళ్లు ఎలాంటి అగ్నిమాపక అనుమతులు తీసుకోలేదని తేలిందన్నారు. శనివారం నుంచి నగరంలోని 1600 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అగ్నిమాపక అనుమతులు లేని బార్లు, పబ్బులు, పాఠశాలలకు నోటీసులు అందించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ... ఈ అంశంపై విచారిస్తామని వెల్లడించారు. జాగ్రత్తలు తీసుకోని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని విశ్వజిత్ హెచ్చరించారు.
ఇవీ చూడండి: ప్రగతి భవన్ బయల్దేరిన రేవంత్... అరెస్ట్