హైదరాబాద్‌లో ఇటీవల వరదలకు ఏర్పడిన బురద వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నగరమంతా శానిటైజేషన్ డ్రైవ్ ప్రారంభించామని... మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని షేక్‌పేట్ కొత్తచెరువులో పెరిగిన చెత్త, గుర్రపుడెక్క తొలగింపు ప్రక్రియను ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌తో కలిసి ప్రారంభించారు.
వీటితో పాటు దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్, డ్రోన్ స్ప్రేయింగ్ పనులను చేయిస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. నగర వ్యాప్తంగా 39 చెరువుల్లో ఈ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. మూసీ నదిలో కూడా శానిటైజేషన్ డ్రైవ్ చేయనున్నట్లు తెలిపారు. కాలనీల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నామన్నారు.
ఇదీ చూడండి: 'వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక శానిటైజేషన్ డ్రైవ్'