గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వచ్ఛత నిబంధనను ఉల్లంఘించిన వారిపై జీహెచ్ఎంసీ విధించిన జరిమానా కోటి రూపాయలకు చేరింది. భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్లపై వేయడం, చెత్తను తగలబెట్టడం, నాలాలో వ్యర్థాలు వేయడం, బహిరంగ మలమూత్ర విసర్జన తదితర అంశాలపై జరిమానాలను విధించారు. తడి పొడి చెత్తసేకరణ కోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేసినా.. సక్రమంగా వినియోగించకుండా నిర్లక్ష్యంగా రోడ్డుపై వేసే వారిపై జీహెచ్ఎంసీ కొరడా ఝుళిపిస్తోంది. ప్రజా బాహుళ్యంలో చైతన్యం తెచ్చేందుకు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. నాలుగు నెలల్లో 8,500 మంది వ్యక్తులు, పలు సంస్థలకు జరిమానా విధించింది. చందానగర్ సర్కిల్ నుంచి అత్యధికంగా 518 జరిమానాల ద్వారా రూ. 16 లక్షలు వసూలు చేసింది.
ఇదీ చూడండి: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి కేటీఆర్ సమీక్ష