ETV Bharat / state

భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్​ఎంసీ కొరడా - Ghmc Focus On Unauthorized Constructions

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్​ఎంసీ కొర‌డా ఝుళిపిస్తోంది. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా, అనుమతుల్లేకుండా కడుతున్న నిర్మాణాల‌ను కూల్చివేసేందుకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తోంది. ఇప్పటికే అనేకసార్లు నోటీసులు ఇచ్చినా... స్పందించ‌ని వారి నిర్మాణాల‌ు తొలగించే ప్రక్రియ చేపడుతోంది. గత కొద్ది రోజల నుంచి ఇప్పటివరకు వందల సంఖ్యలో నిర్మిస్తోన్న నిర్మాణాలను కూల్చివేసింది.

Ghmc Focus On Unauthorized Constructions
భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్​ఎంసీ కొరడా
author img

By

Published : Aug 1, 2020, 3:10 AM IST

భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్​ఎంసీ కొరడా

జంటనగరాల్లో ఏడాది పొడవునా భ‌వ‌న నిర్మాణాలు జ‌రుగుతూనే ఉంటాయి. కొత్తవాటితో పాటు ఉన్న స్థలాల్లోనే నూత‌న భ‌వ‌నాలు కడుతూ ఉంటారు. గ్రేట‌ర్ ప‌రిధిలో నిర్మాణాలు చేయాల‌ంటే జీహెచ్​ఎంసీ అనుమ‌తి త‌ప్పనిస‌రి. కానీ నగరంలోని కొన్నిచోట్ల బల్దియా అనుమతి లేకుండానే పలు ప్రాంతాల్లో లే-అవుట్‌లు వెలుస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా పెద్ద పెద్ద భ‌వ‌నాలు సైతం నిర్మిస్తున్నారు. ఇంకొందరైతే సర్కారీ భూముల్లోనే నిర్మాణాలకు పూనుకుంటున్నారు. చెరువులు, జలాశయాల పరివాహక ప్రాంతాలనూ వదలడం లేదు. ఈ ఆక్రమణల ఫలితంగా వర్షం వస్తేచాలు కాలనీలకు కాలనీలే ముంపునకు గురవుతున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు అధికారులు త‌నిఖీలు నిర్వహించినా కొందరు నిర్మాణదారుల వైఖరిలో మార్పు రావడంలేదు. దీంతో క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలిస్తూ అధికారులు నిర్మాణదారులకు నోటీసులు జారీచేస్తున్నారు. ఈ తాఖీదులను కూడా పట్టించుకోకుడా జరుగుతున్న నిర్మాణాలను కూల్చివేయాలని బల్దియా నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించింది.

అనుమతులకు మించితే అంతే..

శేరిలింగంప‌ల్లి జోన్‌లో ఐదు రోజుల నుంచి చేప‌ట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో 30 భ‌వ‌నాల‌కు చెందిన 140 శ్లాబ్‌ల‌ు కూల్చివేశారు. అంత‌కు ముందు జూన్‌లో అయ్యప్ప సొసైటీలో 29 నిర్మాణాల‌ను కూల్చివేశారు. అనుమతుల్లేని నిర్మాణాల తొలగింపు ప్రక్రియకు బ‌ల్దియా భారీ యంత్రాల‌ను వినియోగిస్తోంది. నిర్మాణ అనుమ‌తుల‌కు మించి నిర్మించిన అంత‌స్తుల‌ు, ఎక్కువ విస్తీర్ణంలో క‌ట్టిన నిర్మాణాల‌పై చర్యలు చేపట్టారు.

అనుమతులు లేకుండా నిర్మించిన ప్లాట్లను కొనొద్దు..

అ‌ధికారికంగా, అనుమ‌తులు లేకుండా నిర్మించిన ప్లాట్లను కొనుగోలు చేయొద్దని జీహెచ్​ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఆక్యుపెన్సి స‌ర్టిఫికెట్ ఉన్న ప్లాట్లనే కొనాలని సూచించారు. ఆక్యుపెన్సి స‌ర్టిఫికెట్లు పొంద‌ని భ‌వ‌నాల‌కు ఆస్తిపన్ను, నీటిపన్నులపై జరిమానాలు ఉంటాయని తెలిపారు. జీహెచ్​ఎంసీ వెబ్‌సైట్‌లోని వివ‌రాలు సరిచూసుకున్న తర్వాతే కొనుగోలుపై ముందుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. జీహెచ్​ఎంసీ స‌ర్కిల్ కార్యాల‌యాల్లో సంబంధిత భ‌వ‌నాలు, ప్లాట్ల నిర్మాణ అనుమ‌తులు, ఆక్యుపెన్సి వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చని తెలిపారు.

ఇవీ చూడండి: 'రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోతోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.