ETV Bharat / state

కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ప్రత్యేకంగా చెత్త సేకరణ - Hyderabad coroan news

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ కంటెయిన్‌మెంట్‌ జోన్ల పరిధిలోని చెత్తను ప్రత్యేకంగా సేకరిస్తోంది. అందులో భాగంగా కేంద్ర కార్యాలయం జోనల్‌ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.

Hyderabad  latest news
Hyderabad latest news
author img

By

Published : May 7, 2020, 9:56 AM IST

భాగ్యనగరంలో కరోనా వ్యాప్తిన అరికట్టేందుకు బల్దియా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో చెత్తను సేకరించేందుకు ప్రత్యేక వాహనాలను కేటాయించారు. జీవ వ్యర్థాలను సేకరించే వాహనాలను ఉపయోగిస్తున్నారు.జీహెచ్​ఎంసీ సిబ్బంది... పాజిటివ్‌ కేసులు నమోదైన ఇంట్లోని చెత్తను ప్లాస్టిక్‌ కవర్లలో నింపి సీల్‌ వేస్తారు. ఆ కవర్లను వాహనంలో నింపుతారు. కొన్ని ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు పాజిటివ్‌ కేసులు ఉంటున్నాయని, అలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతాలను క్లస్టర్లుగా పేర్కొని.. వాటన్నింటికి ఓ వాహనాన్ని కేటాయిస్తున్నామని అధికారులు తెలిపారు.

చెత్త సేకరణ పూర్తయ్యాక సదరు వాహనం వ్యర్థాలను తీసుకెళ్లి భస్మీకరణం చేస్తుందని, చివరగా మిగిలే బూడిదను సిబ్బంది మట్టిలో పాతిపెడుతున్నారని వివరించారు. నగరమంతా ఉత్పత్తయ్యే ఇతర చెత్తను జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డుకు తీసుకువెళ్లి కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దానిపై క్రిమి నాశక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అలా వారం రోజులకుపైగా ఎండబెట్టి అనంతరం ఎరువుల తయారీ, ఇతర ప్రక్రియలకు పంపిస్తున్నామని బల్దియా ఉన్నతాధికారి వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.