హైదరాబాద్లోని నాగోల్ సమీపంలో నిన్న రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందం ఘటనా స్థలానికి చేరుకుని నాలాలో పడ్డ వ్యక్తిని రక్షించారు. ద్విచక్రవాహనాన్ని కూడా బయటకు తీశారు. సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన జీహెచ్ఎంసీ నిర్వహణ బృందాలను స్థానికులు అభినందించారు.
ఇదీ చూడండి : బోయిన్పల్లిలో కారు బీభత్సం