ETV Bharat / state

GHMC Commissioner on Telangana Election 2023 : అసెంబ్లీ పోరుకు 'గ్రేటర్' రెడీ.. వారిపై స్పెషల్ ఫోకస్

GHMC Commissioner on Election Arrangements : హైదరాబాద్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు, పోలీస్ కమిషనర్, కలెక్టర్లతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 15 సెగ్మెంట్లు ఉండగా.. మొత్తం 44,42,458 ఓటర్లు ఉన్నట్లు కమిషనర్ రొనాల్డ్ రోస్ వివరించారు.

Hyderabad Voter List 202
Hyderabad District Electoral Officer Ronald Ross News
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 11:39 AM IST

GHMC Commissioner on Telangana Election 2023 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. సోమవారం రోజున జీహెచ్ఎంసీ(GHMC) హెడ్డాఫీసులో సిటీ సీపీ సీవీ ఆనంద్.. కలెక్టర్ అనుదీప్​​తో కలిసి ఆయన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నగర ఓటర్లు తమ ఓటును మరోసారి పరిశీలించుకోవాలని.. ఓటు లేని వారు అక్టోబర్ 31 వరకు నమోదు చేసుకోవాలని సూచించారు.

Hyderabad Voter List 2023 : హైదరాబాద్​లోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 44,42,458 ఉన్నారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ వెల్లడించారు. ఇందులో పురుషులు 22,79,610 కాగా మహిళా ఓటర్లు 21,62,541 మంది, ట్రాన్స్​ జెండర్స్ 300.. 80 ఏళ్లు దాటిన వారు 83,588 మంది ఉండగా.. వీరికి పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేయనున్నట్లు రొనాల్డ్ రోస్ తెలిపారు. ఇక 18 నుంచి 19 ఏళ్ల వయసున్న వారు 59,082 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. గతంలో ఉన్న ఓటింగ్ శాతం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు.

election commission official 12 cards : ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అధికారికంగా​ ప్రకటించిన.. 12 గుర్తింపు కార్డులివే

"హైదరాబాద్ పరిధిలో 1688 ప్రాంతాల్లో 3986 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో పనిచేసేందుకు 34,452 మంది సిబ్బందిని సిద్దం చేశాం. వారికి త్వరలో శిక్షణ ఇస్తాం. పోలీస్ సిబ్బంది ఎలక్షన్ డ్యూటీ చేస్తారు. ఎన్నికల విషయంలో వచ్చే సమస్యల ఫిర్యాదులు కోసం ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఆర్వో ఆఫీస్​లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం." - రొనాల్డ్ రోస్, హైదారాబాద్ ఎన్నికల అధికారి

Ronald Rose on Telangana Election 2023 : ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే నియమావళి అమల్లోకి వచ్చిందని రొనాల్డ్ రోస్ అన్నారు. 48 గంటల్లో పోస్టర్లు, బ్యానర్లు, వాల్ రైటింగ్ వంటి వాటిని పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో 18 చెక్ పోస్ట్​లు(Check Posts Hyderabad) ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 6 మంది చొప్పున 90 ఫ్లయింగ్ స్క్వాడ్ నియమించాని.. అదేవిధంగా 15 వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేస్తామని వివరించారు. మద్యం, డబ్బు రవాణాపై ప్రత్యేక నిఘా పెడతామని చెప్పారు.

Election Code in Telangana 2023 : నగరంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా 1587 కేంద్రాలను గుర్తించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని.. అందుకోసం 32 కేంద్ర బలగాలను అడిగామని తెలిపారు. డబ్బు రవాణాపై స్పెషల్ ఫోకస్ పెట్టామని.. లైసెన్స్ గన్స్ ఉన్నవారు డిపాజిట్ చేయాలని సూచించారు. 652 మందిని బైండోవర్ చేశామని .. 18 మందిపై పీడీ యాక్ట్(PD Act) పెట్టామని వెల్లడించారు. 2,252 నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేశామని సీపీ తెలిపారు. ఇక వాహనాలు తనిఖీలు చేసే సందర్భాల్లో వాహనదారులు సహకరించాలని కోరారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల పూర్తి వివరాలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.