హైదరాబాద్‌లోని వనస్థలిపురం హుడా సాయినగర్‌లో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పర్యటించారు. ఈ కాలనీలో నివాసముండే 9 మందికి కరోనా పాజిటివ్ రాగా... వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ తరుణంలో హుడా సాయినగర్‌లో పర్యటించిన లోకేశ్ కుమార్ అక్కడి పరిస్థితులపై పోలీసు, జీహెచ్ఎంసీ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బీపీ, షుగర్, డయాలిసిస్ రోగులతో పాటు వృద్ధులు, గర్భిణీల కోసం తీసుకుంటున్న జాగ్రత్త చర్యలపై ఆరా తీశారు. స్థానిక కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ కరుణ, ఉప వైద్యాధికారి భీమా నాయక్‌లు వనస్థలిపురంలోని పరిస్థితిని కమిషనర్‌కు వివరించారు.
ఇవీచూడండి: ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్