మాదాపూర్-కూకట్‌పల్లి మధ్య ప్రస్తుతం ఉన్న రోడ్లపై రద్దీని తగ్గించి వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు రూ. 83.06 కోట్లతో నాలుగు లైన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం నగరంలో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు, రోడ్డు విస్తరణ, మిస్సింగ్ లింక్ రోడ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో మూసాపేట్, కైతలాపూర్-అయ్యప్ప సొసైటీ రోడ్డు మధ్య చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జికి మొత్తం 12 పిల్లర్లతో పనులు జరుగుతున్నాయన్నారు. మాదాపూర్ మార్గంలో ఉన్న 100 ఫీట్ల రోడ్డును కలిపేందుకు అనువుగా అయ్యప్ప సోసైటీ నుంచి సమాంతరంగా రోడ్డును ఇటీవలే వేసినట్టు పేర్కొన్నారు. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తయితే చుట్టుతిరిగి రావాల్సిన వాహనాలు నేరుగా వచ్చే వెసులుబాటు కలగటంతోపాటు 5 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు.
ఇవీచూడండి: ఆన్లైన్ క్లాసులపై దాగుడు మూతలొద్దు.. ప్రభుత్వంపై హైకోర్టు అసహనం