రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ లైవ్ వెబ్‌కాస్టింగ్‌లో వాలంటీర్లుగా పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్, మైజీహెచ్ఎంసీ యాప్ నుంచి నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే వరకు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని వివరించారు.
ధ్రువీకరణ పత్రం
వాలంటీర్లకు ముందస్తుగా ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు... తమ లాప్‌టాప్‌లతో లైవ్ వెబ్‌కాస్టింగ్‌లో పాల్గొనాలని తెలిపారు. ఒక రోజు ముందుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పోలింగ్‌కు ముందు రోజు సంబంధిత పోలింగ్ కేంద్రం సమాచారం తెలుపనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు రెమ్యూనరేషన్‌తో పాటు... ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ghmcelections2020@gmail.com లో సంప్రదించాలని కమిషనర్ సూచించారు.
ఇదీ చదవండి: 'యాదాద్రి పునర్నిర్మాణానికి రూ. 270 కోట్లు ఖర్చు'