హైదరాబాద్‌లోని పంజగుట్ట సర్కిల్లో అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్ఠ అనంతరం జరిగిన ఘటనలపై జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహన్ని కమిటీ నాయకులు ఏర్పాటు చేశారు. అందుకు అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ సిబ్బంది విగ్రహన్ని తొలగించి యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించారు. ఈ క్రమంలో విగ్రహం వాహనం నుంచి కింద పడి ధ్వంసం అయిందని పేర్కొన్నారు. ఈ దురదృష్టకర ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని వెల్లడించారు.
బాధ్యులెవరైనా వదిలిపెట్టాం
ఈ ఘటనపై అంతర్గత విచారణను జరపాలని నగర పోలీసు కమిషనర్‌ను కోరినట్లు దాన కిశోర్ స్పష్టం చేశారు. ఇందుకు బాధ్యులైన యూసుఫ్‌గూడ యార్డ్ ఆపరేటర్ బాలాజీని తొలగించినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: అనుమతి లేకుండా అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహావిష్కరణ