కరోనా నివారణ చర్యలను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. ఇప్పటి వరకు నమోదవుతున్న కేసుల్లో సింహభాగం గ్రేటర్‌లోనే ఉన్నందున ఇక్కడ 17 సర్కిళ్లలో జీహెచ్ఎంసీ ప్రత్యేకాధికారులను నియమిస్తూ బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కేసులు అధికంగా ఉన్న ఏరియాల్లో ఇప్పటికే 126 కంటైన్మెంట్ ప్రాంతాలను గుర్తించారు. అక్కడ అందుతున్న సేవలతో పాటు... కరోనా కట్టడిపై ఈ అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
- మూసాపేట్, కూకట్‌పల్లికి : జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రాహూల్ రాజ్
- ఖైరతాబాద్, జూబ్లిహిల్స్‌కు : జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ప్రియంక
- కాప్రా, మల్కాజిగిరికి : జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జయరాజ్
- కుత్బుల్లాపూర్, అల్వాల్‌కు : అదనపు కమిషనర్ శంకరయ్య
- రాజేంద్ర నగర్‌కి : జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ విజయ లక్ష్మి
- ఉప్పల్, ఎల్బీ నగర్‌కి : అడిషనల్ కమిషనర్ యాదగిరి రావు
- ముషీరాబాద్, అంబర్పేట్కి : అడిషనల్ కమిషనర్ క్రిష్ణలను నియమించారు.
- సికింద్రాబాద్, బేగంపేట్ : జాయింట్ కమిషనర్ సరోజా
- హయత్ నగర్, సరూర్‌నగర్ : జాయింట్ కమిషనర్ పంకజ
- మోహిదీపట్నం, గోశామహల్ : జాయింట్ కమిషనర్ సంధ్య
- యూసుఫ్ గూడ, శేరిలింగంపల్లి : జాయింట్ కమిషనర్ వాణిశ్రీ
- మలక్ పేట్, సంతోష్‌నగర్ : ఈస్ట్ అధికారి విక్టర్
- చాంద్రాయన్ గుట్ట, చార్మినార్‌కు : అధికారి వెంకటేశ్వర్లు
- కార్వాన్కు : రవీందర్ రాజు
- గాజులరామారంలో సీఈ కిషన్
- చందానాగర్, పటాన్చెరులో ఎస్ఈ శ్రీనివాస్
- ఫలక్ నుమాలో ఎస్ఈ శ్రీలక్ష్మి లను నియమించారు.
ఇదీచదవండి ఈనెల 16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ