హైదరాబాద్ ఖాజాగుడా నుంచి హైటెక్ సిటీ వైపు కిలో మీటరు పైవంతెనను జీహెచ్ఎంసీ నిర్మించింది. నిన్న ప్లైఓవర్ ప్రమాద ఘటనపై బల్దియా అధికారులు చర్యలు ప్రారంభించారు. సమస్య కారణాలను గుర్తించి సరిచేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నెల నాలుగున ప్రారంభించిన ఈ ఫ్లైఓవర్‌పై పది రోజుల వ్యవధిలో మూడు ప్రమాదాలు జరుగగా నలుగురు మృత్యువాతపడ్డారు. నిన్నటి ప్రమాదంలో ఒకరు మరణించగా ముగ్గురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.
నియంత్రణ వేగం 40 కి.మీ.:
ఈ ప్రమాదానికి కారణం అతివేగమే కారణమని అధికారులు తెలిపారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పైవంతెన పై నుంచి కింద పడిపోయిందన్నారు. అయితే గతంలో జరిగిన ప్రమాదం తరువాత ఇక్కడ పూర్తిస్థాయిలో సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. వేగ నియంత్రణ కూడా 40 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఈ ప్లైఓవర్ నిర్మాణం ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ నిబంధనలకు అనుసరించి చేపట్టామని బల్దియా ప్రాజెక్ట్స్ ప్రధాన ఇంజినీర్ శ్రీధర్ తెలిపారు.
5 లక్షల పరిహారం:
ప్లైఓవర్‌పై రాకపోకలు నిషేధించాలని బల్దియా ఇంజినీరింగ్ అధికారులకు, సైబరాబాద్ పోలీసులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అన్నిరకాల భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతే కాకుండా ఒక స్వతంత్ర కమిటీని వేసి విచారణ జరపాలన్నారు. మృతి చెందిన సత్యవేణి కుటుంబానికి మేయర్ బోంతు రామ్మోహన్ రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. మూడు రోజుల పాటు పైవంతెనపై వాహనాలను నిలిపి వేయాలని అధికారులకు ఆదేశించారు.
ఇవీ చూడండి: 'పైవంతెన'పై మరో ప్రమాదం... గాల్లో కారు పల్టీ