నగరంలో పేదలు ఆకలితో పస్తులు ఉండకూడదని ప్రభుత్వం 5 రూపాయలకే అన్నపూర్ణ భోజనం పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ నిర్వాహకులు అపరిశుభ్రమైన వాతావరణంలో భోజనాన్ని అందిస్తూ పేదలను రోగాలవైపు నెట్టేస్తున్నారు.
సురారం మల్లారెడ్డి ఆసుపత్రికి ఎదురుగా ఉన్న కేంద్రం వద్ద ఈ దుస్థితి కనిపిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పందులు, మురుగు నీరు ఉన్న చోటనే భోజనం అందిస్తున్నారు. ఆకలితో కడుపు నింపుకునేందుకు వచ్చిన ప్రజలు భోజనంతో పాటు రోగాలను రూ.5కే కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైన ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించి.. శుభ్రమైన వాతావరణంలో భోజనం అందించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: యశోద ఆస్పత్రుల్లో ఆదాయ పన్ను అధికారుల తనిఖీలు