వరద ముంపు నుంచి తిరుపతి ఇంకా తేరుకోలేదు. తినడానికి తిండి కూడా సరిగా దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి వరద బాధితుల సహాయార్థం చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రూ.10లక్షలు విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 లక్షలు అందించింది.
-
We have made a humble donation of Rs 10 lakh to @AndhraPradeshCM relief fund to help with the relief measures in flood-affected areas of #TirupatiRains.
— Geetha Arts (@GeethaArts) November 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">We have made a humble donation of Rs 10 lakh to @AndhraPradeshCM relief fund to help with the relief measures in flood-affected areas of #TirupatiRains.
— Geetha Arts (@GeethaArts) November 24, 2021We have made a humble donation of Rs 10 lakh to @AndhraPradeshCM relief fund to help with the relief measures in flood-affected areas of #TirupatiRains.
— Geetha Arts (@GeethaArts) November 24, 2021
కాగా.. తిరుపతిలో చాలా కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదపోటుకు చెరువులు తెగి నివాస ప్రాంతాలలోకి వరద పోటెత్తుతూనే ఉంది. ప్రధానంగా పద్మావతి మహిళ యూనివర్శిటీ, లింగేశ్వర నగర్, కేశవాయినగుంట, ఆటోనగర్, యశోదనగర్, సరస్వతీనగర్, ఉల్లిపట్టెడ, శ్రీకృష్ణనగర్ ముంపులోనే ఉన్నాయి. గాయిత్రినగర్లోని 2 వేల కుటుంబాలు ఇళ్ల నుంచి బయటకురాలేని పరిస్థితి నెలకొంది.
ఇదీ చూడండి: child death with vaccine: ఒకేసారి ఐదు టీకాలు.. మూణ్నెళ్ల చిన్నారి మృతి