గ్యాస్ సిలిండర్ పేలి భార్యాభర్తలకు తీవ్ర గాయాలైన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్టలోని శ్రీరామ, ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజరిగా పని చేసే నారాయణ చారి, అతని భార్య హరిప్రియ ఆలయం దిగువనే ఉన్న గదిలో నివసిస్తున్నారు. నీటిని వేడి చేసుకునేందుకు పొయ్యి వెలిగించగా గ్యాస్ లీకై పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు.
గమనించిన ఆలయ కమిటీ సభ్యులు పోలీసుల సహాయంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వారిద్దరి శరీరాలు 40శాతం కాలినట్టు వైద్యులు తెలిపారు. పేలుడు ధాటికి ఇంట్లో వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: శిల్పారామంలో సంక్రాంతి సంబురం.. భాగ్యనగరంలో కోలాహలం