స్వచ్ఛమైన గాలిని ఇంటి మిద్దెపైనే పొందవచ్చు. డాబామీదే ఎన్నో ఆకర్షణీయమైన మొక్కలు, పండ్లు, కూరగాయలను పెంచుతూ.. ఆరోగ్యంగా ఉండొచ్చని అంటున్నారు పాడేరుకు చెందిన సుష్మా. ఆమె తన డాబాపైనే ఓ ఉద్యానవనాన్నే ఏర్పాటు చేశారు.
ఇంట్లో మిద్దెపైన స్వచ్ఛమైన గాలి
చిన్నిపాటి ఉద్యానవనాన్ని తలపిస్తున్న ఈ ఇల్లు.... ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పాడేరులోని గడ్డి కాలనీ వీధిలో ఉంది. ఈ రెండంతస్తుల భవనంలో ప్రసాద్ కుటుంబం నివసిస్తోంది. మొక్కల పెంపకంపైన ఉన్న అమితాశక్తితో.. వారు మిద్దె పైన పూలు, పళ్లు, కూరగాయలు పెంచుతున్నారు. సేంద్రీయ ఎరువులు ఉపయోగించి సుష్మా వీటిని సాగు చేస్తున్నారు.
పోషకాలను పెంచేయండి
ఇంటి మిద్దెపై ఖాళీ డబ‌్బాల్లో.. గులాబీలు, మందారాలు, మల్లె, బంతి, సన్నజాజులు వంటి పూల మొక్కలు పెంచుతున్నారు. వీటితో పాటు డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, బెండ, బీర, ఆనప, దోస, వంకాయ, పచ్చిమిర్చి, టమోటా సాగు చేస్తున్నారు. అంతే కాకుండా.. కుందేళ్లు, చేపలను కూడా పెంచుతున్నారు. సేంద్రీయ ఎరువుల వాడకం వలన ఆరోగ్యసమస్యలు దరిచేరవని.. ఇంట్లో సరిపడా కూరగాయలను తక్కువ ఖర్చుతో పండిస్తున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.
మేడపై ఉన్న గార్డెన్‌ను తిలకించేందుకు బంధువులు, ఇరుగుపొరుగు వారు ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నారు. తన సొంత ఇళ్లు కట్టాక డాబాపైన మొక్కలు పెంచడానికి ..ఏర్పాట్లు చేసుకుంటానని రమణి అనే పక్కింటి గృహిణి తెలిపింది.
ఇదీ చూడండి. Jasmin Bhasin: ఈ బుల్లితెర బ్యూటీ మదిని దోచేస్తుందిగా!