మార్క్‌ఫెడ్ పాలకమండలి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఛైర్మన్‌గా మార గంగారెడ్డి, ఉపాధ్యక్షుడుగా బొర్రా రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని మార్క్‌ఫెడ్ భవన్‌లో పాలకవర్గం ఎన్నికను రాష్ట్ర సహకారశాఖ ఎన్నికల అథారిటీ నిర్వహించింది. ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే రావటం వల్ల ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అథారిటీ జాయింట్ సెక్రటరీ అరుణ ప్రకటించారు. ఎన్నిక అనంతరం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు.
ఇదీ చూడండి : తెలంగాణలో నా లక్ష్యం అదే... దాని కోసమే పని చేస్తా: బండి సంజయ్