ETV Bharat / state

'రోడ్డుపై గుంత కనిపిస్తే ఆయన ఆగలేరు... వెంట వెళ్లకుండా నేనూ ఉండలేను' - తెలంగాణ వార్తలు

‘రోడ్డు ప్రమాదం అంటే ఓ కుటుంబం రోడ్డున పడ్డట్లే’.. ఈ ఆలోచనే ఆయన్ని సేవ వైపు నడిపించింది. ఆయన కోసమని అటు వెళ్లి ఆవిడా అందులోనే మమేకమైపొంది. దశాబ్దకాలంగా రోడ్‌ డాక్టర్స్‌గా నిలుస్తున్న వాళ్లే.. వెంకటేశ్వరి, కాట్నం గంగాధర్‌ తిలక్‌ దంపతులు. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఈ దంపతుల్ని అభినందిస్తూ అధికార యంత్రాంగాన్ని మందలించింది. ఈ సేవలో తన అనుభవాలను వెంకటేశ్వరి వసుంధరతో పంచుకున్నారిలా...

gangadhar-couple-story-on-prevention-of-road-accidents
'రోడ్డుపై గుంత కనిపిస్తే ఆయన ఆగలేరు... వెంట వెళ్లకుండా నేనూ ఉండలేను'
author img

By

Published : Jul 21, 2021, 9:10 AM IST

Updated : Jul 21, 2021, 10:01 AM IST

మాది తూర్పుగోదావరి జిల్లా. అయిదో తరగతి వరకే చదువుకున్నా. నా 17వ ఏట తిలక్‌తో పెళ్లైంది. ఆయన విజయవాడ రైల్వే డివిజన్‌లో చేసే వారు. మాకో బాబు, పాప. ఇద్దరూ స్థిరపడ్డారు. 2008లో ఉద్యోగ విరమణ చేశారాయన. తర్వాత హైదరాబాద్‌ వచ్చాం. ఇక్కడ మరో ఉద్యోగంలో చేరారు. ఓరోజు మాసిన దుస్తులతో వచ్చారు. ఏసీలో పని చేసే ఆయన అలా ఎందుకున్నారని అడిగా. అప్పుడే మొదటిసారి గుంతలు పూడ్చి వస్తున్నారని తెలుసుకున్నా. మీకు ఎందుకని కోప్పడ్డా, నచ్చచెప్పినా వినలేదు. ఒక్కో రోజు లంచ్‌ కూడా తినేవారు కాదు. అదేమంటే ‘ఆ సమయంలో రెండు చోట్ల మరమ్మతు చేసొచ్చా’ననే వారు. దీని కోసం ఉద్యోగమూ మానేశారు.

వెంకటేశ్వరి, కాట్నం గంగాధర్‌ తిలక్‌ దంపతులు

అబ్బాయిని పిలిపించా...

ఇక లాభం లేదని అమెరికాలోని మా అబ్బాయి రవికి కబురుపెట్టా. తనైనా నచ్చచెబుతాడనుకున్నా. ఆరోజు వాళ్ల నాన్నతో రవి కూడా బయటికి వెళ్లాడు. వాడెదురుగానే ఓ గుంత కారణంగా బైకు ఆక్సిడెంట్‌లో ఒకరికి గాయాలయ్యాయట. అంతకుముందే దాన్ని పూడ్చబోతుంటే రవి విసుక్కున్నాడట. దాంతో వాళ్ల నాన్న చేస్తున్న పనిని అభినందించి, అమెరికా వెళ్లిపోయాడు. ఉదయాన్నే వెళ్లే ఆయన ఏ సాయంత్రానికో వచ్చేవారు. బాక్సు కూడా తినకుండా అలాగే తెచ్చేవారు. ఇలా కాదని ఆయన కూడా అన్నం పట్టుకుని వెళ్లేదాన్ని. నడి వేసవిలో ఆయన గోతులను మరమ్మతు చేస్తుండటం చూసి సాయమందించడం మొదలుపెట్టా. మా కారులో సిమెంటు, తారు వంటివన్నీ చిన్న బస్తాల్లో వేసుకుని బయల్దేరతాం. ఇప్పుడు నాకూ ఎండైనా, చలైనా, సాయంత్రం వరకూ పని చేసినా శ్రమ అనిపించదు.

ఒక్కోసారి కొందరు వచ్చి తమ అనుభవాలు, మా పనికి కృతజ్ఞతలు చెబుతుంటారు. కొన్నిసార్లు మేం వెళ్లే ముందే అక్కడ రోడ్డు ప్రమాదం జరిగేది. ముందొచ్చుంటే అది జరగకపోయేది కదా అనిపిస్తుంది. నేనూ ఈ సేవలో భాగస్వామినవడం సంతోషంగా ఉంది. ఇప్పుడు నేనూ కూడా రోడ్ల మీద గుంతలున్నాయేమోనని వెతుకుతుంటాను. 64 ఏళ్ల వయసులో ఇదంతా ఎలా చేయగలుగుతున్నారని అడుగుతుంటారు. కొందరి ప్రాణాల్నైనా కాపాడాలనే ప్రయత్నం ముందు వయసు గుర్తురాదు. హైదరాబాద్‌లోనూ, శివారు ప్రాంతాలకూ తిరుగుతుంటాం. నెలకు రూ.30 వేలు అవుతోంది. ఖర్చంతా మాదే. ఈ పదేళ్లలో వందల గుంతలను పూడ్చాం. దీన్నో ఉద్యమంలా భావిస్తున్నాం. ఇది మరికొందర్లో స్ఫూర్తిని కలిగిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టొచ్చు. తెలంగాణ గవర్నరు తమిళిసై, బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌బచ్చన్‌ వంటి వారు ప్రశంసించడం మరవలేను.

ఇదీ చూడండి: Governor tamilisai: ఆ దంపతులకు గవర్నర్ ప్రత్యేక సత్కారం.. ఎందుకంటే?

Last Updated : Jul 21, 2021, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.