ETV Bharat / state

Ganesh Immerssion: గణేశుడి శోభాయాత్రతో మహానగరంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

భాగ్యనగరంలో గణేశుడి శోభాయాత్రతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. గతేడాది కొవిడ్‌ కారణంగా సాదాసీదాగా జరిగిన వేడుకలు.. ఈసారి వైభవంగా జరిగాయి. వర్షం కురిసినప్పటికీ నిమజ్జన వేడుకలు సందడిగా సాగాయి. ట్యాంక్‌బండ్‌ వద్ద ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగనున్నాయి. మొత్తం పూర్తయ్యే వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు.

Ganesh Immerssion: గణేశుడి శోభాయాత్రతో మహానగరంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
Ganesh Immerssion: గణేశుడి శోభాయాత్రతో మహానగరంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
author img

By

Published : Sep 20, 2021, 4:45 AM IST

Updated : Sep 20, 2021, 8:51 AM IST

కరోనా కారణంగా గతేడాది నిరాడంబరంగా నిర్వహించిన గణేశుడి ఉత్సవాలు.. ఈసారి మహానగరంలో వైభవంగా జరిగాయి. లంబోదరుడి శోభాయాత్ర ఆదివారం ప్రశాంతంగా సాగింది. నవరాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. మధ్యాహ్నం తర్వాత పలు ప్రాంతాల్లో వర్షం కురిసినా భక్తులు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. నగర వ్యాప్తంగా 14 మార్గాల్లో ఈ యాత్ర ప్రశాంతంగా నిర్వహించారు. చివరికి గణపయ్యలు హుస్సేన్‌సాగర్‌కు చేరుకున్నారు.

Ganesh Immerssion: గణేశుడి శోభాయాత్రతో మహానగరంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

భక్తుల కిటకిట..

భక్తజన సందడితో ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌రోడ్డు, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌ పరిసరాలు కిక్కిరిశాయి. డీజేలు, డప్పుల దరువులు, నృత్యాలతో భక్తులు సందడి చేశారు. యువత, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. హుస్సేన్‌సాగర్‌తోపాటు నగరంలోని 25 ప్రత్యేక కొలనులు, 33 చెరువుల వద్ద నిమజ్జనం చేశారు.

.

ప్రణాళికాబద్ధంగా మహాగణపతి నిమజ్జనం..

శనివారం రాత్రి నుంచే నగరంలో నిమజ్జన సందడి కన్పించింది. కాలనీలు, అపార్ట్‌మెంటు వాసులు బృందాలుగా వెళ్లి గణనాథులను నిమజ్జనం చేశారు. ఉత్సవంలో జాప్యానికి తావియ్యకుండా ముందుగానే ఖైరతాబాద్‌ గణపతి తొలుత నిమజ్జనం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి నుంచే మహాగణపతి దర్శనాన్ని నిలిపివేశారు. ఆదివారం వేకువజామున 5 గంటలకే విగ్రహాన్ని భారీ వాహనంపైకి ఎక్కించారు. 8 గంటలకు ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. లక్డీకాపుల్‌, టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం మార్గం గుండా ఎన్టీఆర్‌ మార్గ్‌లోని భారీక్రేన్‌ వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు నిమజ్జనం పూర్తయింది. బాలాపూర్‌ గణేశ్‌యాత్ర ఉదయం 11 గంటలకే మొదలైంది. సాయంత్రం 7.30 గంటలకు సాగర్‌లో నిమజ్జనం జరిగింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు.

మంత్రుల విహంగ వీక్షణం...

నిమజ్జనోత్సవాల పర్యవేక్షణకు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్‌లో ట్యాంక్‌బండ్‌, పాతబస్తీ, ఇతర నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. ఇవాళ మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. నిమజ్జనోత్సవం పూర్తయ్యే వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు.

నిమజ్జనానికి తరలివచ్చిన భక్తుల ఆకలి తీర్చేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేశాయి. అబిడ్స్‌లో రాత్రి ఒంటి గంట నుంచి 60 వేలమందికి భాగ్యనగర్‌ కమాడ్‌ సేవ సంఘ్‌ ప్రతినిధులు అల్పాహారాన్ని అందించారు. 23ఏళ్లుగా ప్రతిఏటా ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘ్ ప్రతినిధులు తెలిపారు.

.

లక్ష సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌ నిమజ్జనోత్సవాలపై పోలీసులు నిఘా ఉంచారు. ప్రతి ఠాణాలో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఊరేగింపు మార్గాల్లో దాదాపు లక్ష కెమెరాల పర్యవేక్షణ ఉండేలా ప్రత్యేక వ్యవస్థను అమలు చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఉదయం నుంచే తన కార్యాలయంలో ఉండి నిమజ్జనాలను పర్యవేక్షించారు.

నగర శివారులో రూ.41 లక్షలు పలికిన లడ్డూ

.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడజాగీర్‌ నగరపాలిక పరిధి సన్‌సిటీ కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లో ఆదివారం నిర్వహించిన వేలంలో వినాయకుడి లడ్డూ రికార్డు స్థాయిలో రూ.41 లక్షలు పలికింది. ఆర్వీ దివ్యా చారిటబుల్‌ సభ్యులు ఈ లడ్డూను దక్కించుకున్నారు.

* బాలాపూర్‌ లడ్డూ ఈసారి రూ.18.90 లక్షలు పలికింది. వేలం పాటలో ఆంధ్రపదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌.. స్థానికుడు నాదర్‌గుల్‌ వాసి మర్రి శశాంక్‌రెడ్డితో కలిసి దీన్ని కైవసం చేసుకున్నారు. దాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానుకగా అందజేస్తానని తెలిపారు.

* మాదాపూర్‌లోని మైహోం భుజాలో కన్నరెడ్డి విజయ్‌ భాస్కర్‌రెడ్డి.. గణేశ్‌ లడ్డూను రూ.18.50 లక్షలకు దక్కించుకున్నారు.

Laddu: గచ్చిబౌలి గణేశ్ లడ్డూకి రికార్డు రేట్... ఎన్ని లక్షలంటే?

Last Updated : Sep 20, 2021, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.