ETV Bharat / state

GANESH IMMERSSION: రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా నిమజ్జనం.. ఘనంగా వీడ్కోలు పలికిన భక్తజనం

రాష్ట్రవ్యాప్తంగా గణనాథుని నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న విఘ్నేశ్వరుడు.. గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. మళ్లీ రావయ్యా.. బొజ్జ గణపయ్య అంటూ భక్తులు లంబోదరుడిని సాగనంపారు. ఆట పాటలు, కోలాటాల మధ్య గణనాథుడికి వీడ్కోలు పలికారు.

GANESH IMMERSSION: రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా నిమజ్జనోత్సవం..

author img

By

Published : Sep 20, 2021, 4:47 AM IST

Updated : Sep 20, 2021, 5:15 AM IST

రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. భక్తుల ఆటపాటల నడుమ నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా సాగింది. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో నిమజ్జన కార్యక్రమం శోభాయమానంగా జరిగింది. వాహనాలు అందంగా అలంకరించిన భక్తులు.. జోరు వర్షంలోనూ బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికారు. బంధం చెరువు, పద్మాక్షి గుండం, చిన వడ్డేపల్లి, ఉర్సుగుట్ట కోట, హసన్​పర్తి చెరువులతో పాటు.. 27 చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాల్లోనూ నృత్యాలు, కోలాటాల మధ్య నిమజ్జనం సందడిగా సాగింది. మహబూబాబాద్​లో ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ నృత్యాలతో అలరించారు.

GANESH IMMERSSION: రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా నిమజ్జనోత్సవం..

కరీంనగర్​లో టవర్​ సర్కిల్​ వద్ద వినాయకుడికి మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్​రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి మేయర్​ సునీల్​రావు నృత్యం చేశారు. కరీంనగర్​లోని భారీ విగ్రహాలను మానకొండూరు చెరువులో నిమజ్జనం చేశారు. సిరిసిల్ల, జగిత్యాలలో యువతి, యువకుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీలో తుంపర్లతో నీటిని వెదజల్లుతూ నిమజ్జనం చేశారు. నిజామాబాద్ జిల్లాలో గణనాథుల నిమజ్జనం శోభాయమానంగా జరిగింది. బోధన్​లో గజముఖ దేవుడిని పురవీధుల గుండా తిప్పుతూ రాకాసిపేట్ వినాయకుల బావితో పాటు పసుపువాగులో నిమజ్జనం చేశారు. పెద్ద విగ్రహాలను బాసరకు తరలించారు. గణనాథుడి నామస్మరణతో మంచిర్యాల పట్టణం మార్మోగింది.

ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా నిమజ్జన వేడుకలు వైభవంగా సాగాయి. శోభాయాత్రలను తిలకించేందుకు ఆయా ప్రాంతాల్లో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మిర్యాలగూడలోని బంగారుగడ్డలో శివపార్వతుల వేషధారణలతో చేసిన ఊరేగింపు ఆకట్టుకుంది. ఖమ్మంలో చిరుజల్లులు కురుస్తున్నా.. భక్తులు విజ్ఞేశ్వరుడుని సాగనంపారు.

ఇదీ చూడండి: Ganesh Immersion Hyderabad: హైదరాబాద్​లో గణేశుల శోభాయాత్ర ఏరియల్​​ వ్యూ చూశారా..?

Last Updated : Sep 20, 2021, 5:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.