భాగ్యనగరంలో పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన మండపాల్లో బొజ్జ గణపయ్య కొలువు తీరాడు. ఏటా భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి జరుపుకుంటాం. ఏకదంతున్ని 21 రకాల పత్రితో పూజలు చేస్తాం. ఓంకార రూపుడైన గణనాధున్ని మట్టితో తయారుచేసుకుని పర్యావరణాన్ని కాపాడుకుందామని.. మండపాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపి ఐక్యమత్యాన్ని చాటిచెబుదామని పురుషోత్తమ శర్మ తెలిపారు. మరి ఈ పండగ ప్రాముఖ్యత ఏమిటో పురుషోత్తమ శర్మ మాటల్లోనే తెలుసుకుందాం.
ఇదీ చూడండి :మట్టి గణపతి - మహా గణపతి