ETV Bharat / state

Ganesh Chathurthi 2023 Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా గణేశుడి సందడి.. వినూత్న రూపాల్లో కొలువుదీరిన ఏకదంతుడు

Ganesh Chathurthi 2023 Celebrations : రాష్ట్రవ్యాప్తంగా గణపతి ఉత్సవాల సందడి నెలకొంది. నేటి నుంచి వాడవాడలా బొజ్జ గణపయ్యను నిలిపేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో విగ్రహాల కొనుగోళ్లు, పూజా సామగ్రి కొనుగోళ్లకు జనం బారులు తీరారు. మట్టి వినాయకులని పూజించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

Vinayaka Chavithi 2023 in Telangana
Ganesh Chathurthi 2023 Celebrations
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 9:44 PM IST

Ganesh Chathurthi 2023 Celebrations రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు.. వినూత్న రూపాల్లో కొలువుదీరిన ఏకదంతుడు

Ganesh Chathurthi 2023 Celebrations : రాష్ట్రంలో వినాయకచవితి ఉత్సవాలు(Ganesh Chaturthi) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గణేశ్​ చతుర్థి పండగను ఘనంగా నిర్వహించేందుకు.. భాగ్యనగర వాసులు పూనుకొన్నారు. నవరాత్రి మహోత్సవాలకు నేటి నుంచి గణనాథుడు ముస్తాబవుతుండటంతో.. పూజా సామగ్రి కొనుగోళ్లతో నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ గుడిమల్కాపూర్ మార్కెట్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Ganesh Idol on Head Pin in Jagtial : గుండు పిన్నుపై గణపతి ప్రతిమ.. భళా అనిపించేలా సూక్ష్మ కళాకారుని ప్రతిభ

వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించడంతో.. ధరలు ఎక్కువగా ఉన్నా సరే మట్టి విగ్రహాలని పూజించడానికే ప్రజలు సుముఖత చూపుతున్నారు. మరోవైపు ధరలు బాగా పడిపోయాయని.. వ్యాపారస్తులు వాపోతున్నారు. కొందరు రాజకీయనాయకులు.. తమ పార్టీకి ఉన్న విఘ్నాలు తొలగాలని లంబోధరుడిని స్మరిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణనాథులను ప్రతిష్ఠించవద్దని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో మట్టి విగ్రహాలకు గిరాకీ పెరిగింది.

Vinayaka Chavithi 2023 in Telangana : ఎంజే మార్కెట్, సుల్తాన్​బజార్ తదితర ప్రాంతాలు మట్టి విగ్రహాల కొనుగోలు దారులతో కళకళలాడుతున్నాయి. సికింద్రాబాద్​లోని గణేశ్​ దేవాలయంలో.. మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్​ఎస్​ యువజన నాయకులు.. కొప్పుల హర్దీప్​రెడ్డి ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.

వినాయక చవితిని పురస్కరించుకొని వరంగల్‌ జిల్లాలో గణపతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఖాజీపేటలోని శ్వేతార్కగణపతి ఆలయంలో భక్తులు బొజ్జ గణపయ్యకు విశేష పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భక్తులు ఏకదంతునికి నైవేథ్యాలు, కుడుములు, ఉండ్రాళ్లు సమర్పించారు. సంగారెడ్డిలోని రుద్రారంలో వెలసిన స్వయంభూ విజ్ఞాధిపతి దేవస్థానానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

Khairatabad Ganesh Photo Gallery 2023 : ఖైరతాబాద్ గణపతి వద్ద భక్తుల కోలాహలం.. సెల్ఫీలు తీసుకుంటూ సందడి

Vinayaka Festival 2023 : ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వినాయక వేడుకలకు మండపాలు సర్వం సిద్ధమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు మార్కెట్లలో ఆది దేవుని పండగ సందడి నెలకొంది. ఇక్కడ లభించే సీతాఫలాలు, అరుదుగా కనిపించే రకరకాల పూలు కోసం భక్తులు పోటీపడ్డారు.

జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు.. డాక్టర్ గుర్రం దయాకర్ తన ప్రతిభతో పలువురిని ఆకట్టుకుంటున్నారు. గుండు పిన్నుపై చంద్రయాన్-3, జీ-20, భారతదేశం జెండా పట్టుకుని నిలబడి ఉన్న గణనాథుడిని తయారు చేసి ఔరా! అనిపించారు. మెట్​పల్లిలోని లయన్స్ క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు మట్టి, విత్తన వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.

Ganesh Chaturthi 2023 : మానవ కోటికి వినాయక చవితి చాటి చెప్పే సందేశం ఏమిటి?

Cow Dung Ganesh Idols Nirmal 2023 : పర్యావరణాన్ని కాపాడే.. గోమయ గణపయ్యను చూసొద్దామా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.