ETV Bharat / state

Gamyam App in TSRTC Ordinary Buses : ఇకపై ఆర్డినరీ బస్సులకీ 'గమ్యం' యాప్​.. - బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే యాప్​

Gamyam App in TSRTC Ordinary Buses : టీఎస్​ఆర్టీసీ ఎక్స్​ప్రెస్​ ఆపైన స్థాయి ఉన్న వాటికి పెట్టిన గమ్యం యాప్​ని ఆర్డినరీ బస్సులకి అందించాలని నిర్ణయం తీసుకుంది. బస్సు ట్రాకింగ్​తో పాటు.. మహిళల భద్రతకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ఆదాయం పెరిగేందుకు ఈ నిర్ణయం తీసుకుందని సంస్థ వెల్లడించింది.

How to Use Gamyam App for Bus
Gamyam App in TSRTC Buses
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 1:17 PM IST

Gamyam App in TSRTC Ordinary Buses : టీఎస్​ఆర్టీసీ(TSRTC) సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. నూతనంగా సాధారణ బస్సుల్లో టెక్నాలజీని ఉపయోగించాలని నిర్ణయించింది. పల్లె వెలుగు, సీటీ ఆర్డినరీన రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. ఆ బస్సును ట్రాక్​ చేసేలా 'గమ్యం' యాప్​తో అనుసంధానం చేయాలని రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలకి ఆదేశాలు ఇచ్చింది.

Technology Use in TSRTC Buses : టీఎస్​ఆర్టీసీ సంస్థకు ఎక్కువగా నష్టాలు సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు బస్సుల ద్వారా వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే ఈ బస్సులకు ఆటోలు, జీపులు నుంచి అధిక పోటీ నెలకొంది. అవి ప్రయాణికులు కోరుకున్న చోట ఆపుతున్నారు. ఆర్టీసీ బస్సులో అలాంటి సదుపాయం లేదు. దీంతో పాటు ఈ బస్సులు ఎప్పుడు వస్తాయో కచ్చితంగా ఎవరికి తెలియని పరిస్థితి. నగరాల్లో ఇలాంటి సమస్య అధికంగా ఉంటుంది. ట్రాఫిక్​ కారణంగా ఆర్టీసీ బస్సులు చాలా ఆలస్యంగా వెళుతున్నాయి.

Sajjanar Launched TSRTC Gamyam App : బస్సుల ట్రాకింగ్ కోసం టీఎస్​ఆర్టీసీ ‘గ‌మ్యం’ యాప్..

Uses of Gamyam APP : పెళ్లిళ్లు, రాజకీయ సభలు జరిగినప్పుడు వీటిని వినియోగించుకుంటారు. దీంతో ఆ ప్రాంతంలో ఉండే ప్రయాణికులకు బస్సుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. బస్సులను వేరే మార్గాల్లోకి మళ్లించినప్పుడు.. ప్రయాణికులకి సరైన సమాచారం అందించరు. దీంతో ప్రజలు అధిక సమయం బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవే కాకుండా ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందుకే సంస్థ ఈ బస్సులకి గమ్యం యాప్​తో అనుసంధానం చేస్తే.. బస్సు ఎప్పుడు వస్తుంది? ఎక్కడ ఉంది? ఎంత దూరంలో ఉంది? ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీని వల్ల ప్రయాణికుల సమయం ఆదా చేయవచ్చు.

GAMYAM APP Features : గమ్యం యాప్(Gamyam APP)​ ద్వారా ఆరోజుకి ఆ మార్గంలో ఎన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని రన్నింగ్​లో ఉన్నాయి. ఏ సమయానికి వస్తుందో తెలుసుకోవచ్చు. ఇందులో మహిళల భద్రతకి సంబంధించి ఫీచర్లు ఉన్నాయి. బస్​స్టాప్​లో కాకుండా బయట ఎక్కడైన ఉండి బస్సు ఎక్కాలనుకున్నప్పుడు.. యాప్​లో 'ఫ్లాగ్​ ఏ బస్​' ఆప్షన్​ క్లిక్​ చేస్తే ఫోన్​ స్కీన్​ ఫ్లోరోసిస్​ లైట్​గా మారిపోతుంది. ఈ ఫీచర్​ ఎక్కువగా రాత్రి సమయాల్లో ఉపయోగపడుతోంది. ఈ లైట్​ కనిపించగానే బస్సును ఆపి ప్రయాణికుల్ని ఎక్కించుకునేలా ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కల్పిస్తోంది.

TSRTC AC Electric Buses Launch Today : హైదరాబాద్​లో నేటి నుంచి గ్రీన్ మెట్రో బస్సులు రయ్​రయ్

TSRTC Total Ordinary Buses : ప్రస్తుతం ఆర్టీసీలో 8,571 బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో రెండు నెలలు క్రితం 4,170 బస్సులకి ట్రాకింగ్​ సదుపాయం అందించింది. కానీ సంస్థ ఆశించిన స్పందన రాక.. ఆదాయం పెరగలేదు. దీనికి కారణం మొత్తం బస్సుల్లో సగానికిపైగా సాధారణ బస్సులే. పల్లెవెలుగు బస్సులు 3,107, సిటీ ఆర్డినరీ 1,569 మొత్తం 4,676 సాధారణ బస్సులున్నాయి. ఈ బస్సులకి పరికరాలు పెట్టే ప్రక్రియ మొదలయింది.

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బస్సులు

బస్సు రకంబస్సుల సంఖ్య
పల్లె వెలుగు 3,107
సిటీ ఆర్డినరీ1,569
సాధారణ బస్సులు మొత్తం4,676
మొత్తం బస్సులు8,571

TSRTC Gamyam App : మీ బస్సు ఎక్కడుందోనని ఆగం కాకండి.. ఈ 'గమ్యం'తో చిటికెలో తెలుసుకోండి..

TSRTC Electric Buses Inauguration in Hyderabad : భాగ్యనగర రోడ్లపై ఎలక్ట్రిక్​ బస్సులు.. రయ్​ రయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.