ETV Bharat / state

FRUIT MARKET: గడ్డి అన్నారం పండ్ల విపణి తరలింపు షురూ! - ఔటర్​ రింగ్​ రోడ్డు తరలింపు

గడ్డి అన్నారం మార్కెట్​కు తాళం పడే అవకాశాలున్నాయి. ఈ స్థలాన్ని ఆరోగ్య శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోహెడలో ఏర్పాటు చేస్తున్న మార్కెట్​లో శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తి చేసి తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు.

FRUIT MARKET
తరలింపు షురూ!
author img

By

Published : Aug 7, 2021, 10:21 AM IST

దేశంలో అనేక ప్రాంతాలకు చెందిన పండ్లు గడ్డిఅన్నారం మార్కెట్‌కు చేరుతాయి. ఇక్కడి నుంచి నగరం నలుమూలలకే కాదు.. ఉత్తరాదికీ ఎగుమతి అవుతాయి. అందరికీ చేరువగా ఉన్న ఈ విపణి ఇప్పుడు ఔటర్‌ ఆవలికి మారబోతోంది. గడ్డి అన్నారం స్థలాన్ని ఆరోగ్య శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఎప్పుడైనా మార్కెట్‌కు తాళం పడే అవకాశాలున్నాయి.

గడ్డి అన్నారం విపణి నుంచి టోకున పండ్లు కొనే చిరువ్యాపారులు సిటీ బస్సుల్లో కాలనీలకు చేరుకుని అమ్ముకునేవారు. రానున్న రోజుల్లో ఔటర్‌ రింగు రోడ్డు దాటి వెళ్లి సొంత వాహనాల్లో పండ్లు తెచ్చుకోవాలంటే రవాణా ఖర్చులు అధికమై వినియోగదారుడికి చేరేసరికి ధరలు పెరగడం ఖాయమని పలువురు వ్యాపారులంటున్నారు.

కోర్టులో కేసు ఉండగానే..

మార్కెట్‌ తరలింపుపై ఎలాంటి అభ్యంతరం లేదని, ఇక్కడ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కమీషన్‌ ఏజెంట్లు చెబుతున్నారు. అయితే, ఆగమేఘాల మీద తరలింపు సరికాదని పేర్కొంటున్నారు. కోహెడలో ఏర్పాటు చేస్తున్న మార్కెట్‌లో శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తి చేసి తరలించాలని కోరుతున్నారు. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు.

నేడు సమావేశం..

ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో బాటసింగారంలోని లాజిస్టిక్‌ హబ్‌కు పండ్ల మార్కెట్‌ తరలింపుపై కమీషన్‌ ఏజెంట్లతో ఎల్‌బీనగర్‌ మార్కెట్‌ కార్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ శనివారం నిర్వహించనుంది. బాట సింగారంలో మార్కెట్‌ సందర్శనకు ఏర్పాట్లు చేసింది. వారం రోజుల్లో ఖాళీ చేయాల్సి ఉంటుందనే సంకేతాలు ఇచ్చింది.

ఇదీ చూడండి: కొలిక్కి రాని పండ్ల మార్కెట్ తరలింపు వ్యవహారం

నాణ్యమైన షెడ్లు నిర్మించాకే తరలించండి: రేవంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.