రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గద్దర్ అన్నారు. ఉగ్రవాదం నుంచి దేశాన్ని కాపాడాలని అన్నారు. తనపై హత్యాయత్నం జరిగిందని చెప్పడానికి కేసీఆర్ 5 నిమిషాల సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో లౌకిక పార్టీ అధికారంలోకి రావాలని... నయా భూస్వామ్య విధానంతో ఉన్న పార్టీలకు తాను వ్యతిరేకమని గద్దర్ వ్యాఖ్యానించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా, నిజాయితీగా ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్సీ ఫలితాలే రిపీట్: పొన్నం ప్రభాకర్