ETV Bharat / state

HERITAGE SITES: వారసత్వ కట్టడాల కోసం మూడు స్థాయిల్లో కమిటీలు - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలోని వారసత్వ కట్డడాల(HERITAGE SITES) సంరక్షణ, నిర్వహణకు మూడు స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర, జిల్లా, జీహెచ్ఎంసీ పరిధిల్లో వేర్వేరుగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. రాష్ట్ర స్థాయిలో సీఎస్, జిల్లాల్లో కలెక్టర్లు వారసత్వ కమిటీలకు నేతృత్వం వహించనున్నారని వెల్లడించింది.

HERITAGE SITES protection, HERITAGE SITES in telangana
వారసత్వ కట్టడాల కోసం మూడు స్థాయిల్లో కమిటీలు, తెలంగాణలో వారసత్వ కట్టడాలు
author img

By

Published : Aug 18, 2021, 12:43 PM IST

తెలంగాణలో వారసత్వ కట్టడాల(HERITAGE SITES) సంరక్షణ, నిర్వహణకు మూడు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర, జిల్లా, జీహెచ్‌ఎంసీ పరిధిల్లో వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్ర స్థాయిలో సీఎస్, జిల్లాల్లో కలెక్టర్లు వారసత్వ కమిటీలకు నేతృత్వం వహించనున్నారు. జీహెచ్ఎంసీ(GHMC), హెచ్ఎండీఏ(HMDA) పరిధిలో బల్దియా కమిషనర్ నేతృత్వం వహిస్తారని పేర్కొంది. దీంతో పాటు ప్రతి కమిటీకి ఇద్దరిని కోఆప్షన్ సభ్యులుగా నామినేట్ చేస్తామని ప్రకటించింది.

రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా.. టూరిజం, ఫైనాన్స్, విద్యా శాఖల కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. హెరిటేజ్ శాఖ డైరెక్టర్ ఈ కమిటీకి సభ్యుడిగా ఉంటూ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. జిల్లా స్థాయి కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. జిల్లా ఎస్పీ, జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా అటవీ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా టూరిజం అధికారి, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారులు సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీకి జిల్లా హెరిటేజ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సభ్యుడిగా ఉంటూ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పాలకమండలి కమిషనర్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ కమిషనర్లు, టూరిజం శాఖ కమిషనర్, హెచ్‌ఎండీఏ చీఫ్ ప్లానింగ్ అధికారి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. హెరిటేజ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఈ కమిటీకి సభ్యుడిగా ఉంటూ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. వీరితో పాటు రాష్ట్ర పురావస్తు శాఖ, హెరిటేజ్, చారిత్రక నేపథ్యం ఉన్న ఇద్దరు నిపుణలు కో-ఆప్షన్ సభ్యులుగా వ్యవహరిస్తారని జీవోలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Gandhi Hospital Rape Case: 'గాంధీ'లో అత్యాచారంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.