ETV Bharat / state

భారీ వర్షాలతో ఉరకలెత్తుతున్న గోదావరి, కృష్ణా నదులు

పరీవాహక ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉరకలెత్తి ప్రవహిస్తోంది. శ్రీరామసాగర్‌ నుంచి మేడిగడ్డ వరకు ఉన్న ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం భారీగా వస్తోండడంతో అన్ని రిజర్వాయర్లు, బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణాబేసిన్‌లో గురువారం ఆలమట్టికి ప్రవాహం పెరగడంతో నారాయణపూర్‌ నుంచి లక్షా 20వేల క్యూసెక్కులు విడుదల చేశారు. శుక్రవారానికల్లా జూరాల, శ్రీశైలానికి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.

full-of-water-in-telangana-projects
భారీ వర్షాలతో ఉరకలెత్తుతున్న గోదావరి..
author img

By

Published : Jul 23, 2021, 10:28 AM IST

గోదావరి నదిపై ఉన్న ఎస్సారెస్పీ జులైలో రెండోసారి నిండింది. ఏటా సెప్టెంబరులో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుతుంది. 2013లో మొదటి సారి.. మళ్లీ ఇప్పుడు ముందస్తుగా నిండింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు. బుధవారం సాయంత్రానికి 73.5 టీఎంసీలు ఉండగా.. గురువారం సాయత్రానికి పూర్తి నిల్వ సామర్థ్యానికి చేరింది. 2005 తర్వాత మళ్లీ జులైలో దిగువకు నీటిని విడుదల చేసింది ఇప్పుడే. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి అత్యధికంగా గురువారం మధ్యాహ్నం 4.32 లక్షల క్యూసెక్కులు రాగా సాయంత్రానికి మూడు లక్షలకు తగ్గింది. రాత్రి ఏడు గంటల సమయంలో 35 గేట్లు ఎత్తి ఆరు లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు. రాత్రి 9 గంటల సమయానికి దాన్ని 3 లక్షలకు తగ్గించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ నీటిమట్టం 1089.80 అడుగులు కాగా... నీటి నిల్వ 83.772 టీఎంసీలుగా ఉంది.

22 గేట్ల ఎత్తివేత...

దిగువన ఎల్లంపల్లికి రాత్రి 9 గంటలకు 5.8 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 40 గేట్లు ఎత్తి 7.74 లక్షల క్యూసెక్కులను వదిలారు. కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగడంతో రెండు లక్షల క్యూసెక్కులు బయటకు వదిలారు. మధ్యమానేరుకు 90వేల క్యూసెక్కులు వస్తుండగా 22 గేట్లు ఎత్తి 1.03లక్షల క్యూసెక్కులు వదిలారు. దిగువ మానేరుకు మధ్యమానేరు నుంచి లక్ష క్యూసెక్కులు, మానేరు నుంచి 45 వేలు కలిపి 1.04లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 63వేల క్యూసెక్కులు వదిలారు.

కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో..

కృష్ణా ప్రాజెక్టుల్లోకి వరద పెరుగుతోంది. జూరాలకు 70వేల క్యూసెక్కులు రాగా మొత్తం వదిలారు. 215 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల శ్రీశైలంలో 73.23 టీఎంసీలు ఉంది. 75,938 క్యూసెక్కులు వస్తుండగా, 28,252 క్యూసెక్కులు విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు వదిలారు. పులిచింతలకు 25,730 క్యూసెక్కులు వస్తుండగా 10,600 క్యూసెక్కులు వదులుతున్నారు. మూసీకి 3,520 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా అంతే మొత్తంలో బయటకు వదులుతున్నారు.

ఇదీ చూడండి: గతేడు తెగిన చెరువు కట్టలు.. ఇప్పటికీ పట్టించుకోని అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.