చైనా యాప్‌ల తరహాలో ఆ దేశ ఉత్పత్తులను భారత్‌లో నిషేధిస్తే... దేశంలోని పరిశ్రమలకు అది కోలుకోలేని దెబ్బ అవుతుందని తెలంగాణ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు కరుణేంద్ర జాస్తీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ పరిశ్రమలను సమాయత్తం చేయకుండా... అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంటే వేల సంఖ్యలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడతాయన్నారు. లక్షల మంది రోడ్డున పడతారని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటికీ అంతర్జాతీయంగా పోటీ ఇచ్చే పరిశ్రమలు లేవని... కేవలం సెంటిమెంట్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభావం దారుణంగా ఉంటుందంటున్న కరుణేంద్ర జాస్తీ తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇవీ చూడండి: 'తెరాస నేతల జేబులు నింపుకోవడానికే సాగునీటి ప్రాజెక్టులు'