అమిత్‌షా సమక్షంలో కమల తీర్థాన్ని పుచ్చుకున్న డీకే అరుణ. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో డీకే అరుణ ఆ పార్టీలో చేరారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, డీకే అరుణ భేటీ అయ్యారు. అరుణ వంటి సీనియర్ నేతలు తమ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు.
డీకే అరుణ బాటలో ఇంకెందరో ?
కాంగ్రెస్ కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలపై ప్రజలు విసుగు చెందారని లక్ష్మణ్ఆరోపించారు. భాజపాలో చేరేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నారని ఆయన స్పష్టం చేశారు. డీకే అరుణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇవాళ స్పష్టత వస్తుందని తెలిపారు.
ఇవీ చూడండి :తెరాస గూటికి కొల్లాపూర్ ఎమ్మెల్యే