ETV Bharat / state

FRIENDSHIP DAY 2021: ఒంటరైనా... ఓటమైనా వెంట ఫ్రెండే!

ఆస్తి, అంతస్తులు లేని వాడు కాదు.. స్నేహితులు లేని వాడే నిరుపేద అని పెద్దలంటారు. మరి ఆ మాటను నిజం చేసింది కరోనా మహమ్మారి. ఏడాదిన్నరగా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్​ మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. కరోనా విపత్కర సమయాల్లో రక్తసంబంధీకులే దూరం పెడితే కలతచెందిన హృదయాలెన్నో. వారి ఆ బాధ నుంచి విముక్తి చేసి కోలుకునేదాకా నిరంతరం పర్యవేక్షిస్తూ ఆపన్నహస్తాన్ని అందించేది ఒక్కడే.. సమస్యలు ఏవైనా అండగా నిలుస్తూ నేనున్నాననే భరోసా ఇస్తాడు. అతనే స్నేహితుడు. ఆ బంధం పేరే స్నేహం. రేపు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ కోసం స్పెషల్​..

friendship day special story
ఫ్రెండ్​ షిప్​ డే 2021
author img

By

Published : Aug 1, 2021, 7:33 AM IST

  • సుహాస్‌ కొవిడ్‌ బారిన పడ్డాడు. ఇంట్లోవాళ్లే దగ్గరకి రాని పరిస్థితి. బతకనేమో అనే భయం పట్టుకుంది. ఫ్రెండ్‌ మణికి విషయం తెలిసింది. ‘అరే యార్‌.. నీకేం కాదు. ఇదీ జలుబు లాంటిదే. పదిరోజుల్లో కోలుకుంటావ్‌’ అని భరోసా ఇచ్చాడు. పల్స్‌ ఆక్సిమీటర్‌, ట్యాబ్లెట్ల దగ్గర నుంచి మంచి వంటకాల వరకూ తీసుకొచ్చి పెట్టాడు. రెండు వారాల్లో సుహాస్‌ మామూలయ్యాడు. ఆపై ఇద్దరూ బైక్‌పై లాంగ్‌టూర్‌కి వెళ్లిపోయారు.
  • లావణ్య లవ్‌లో మోసపోయింది. చావే దిక్కనుకుంది. నిద్రమాత్రలు మింగితే హాస్టల్‌మేట్‌ హరిత వెంటనే స్పందించింది. రెండ్రోజులు అమ్మలా సపర్యలు చేసింది. ‘చావడం కాదు.. నిన్ను చీట్‌ చేసినోడి చెంప పగలగొట్టేలా ఎదిగి చూపించు’ అంది. లావణ్య పట్టుదలతో చదివింది ఏడాది తిరగకముందే బ్యాంక్‌ పీవోగా ఎంపికైంది.
  • శ్రీధర్‌కి అప్పులు పెరిగాయి. ఉన్న ప్లాట్‌ అమ్మేయాలనుకున్నాడు. ‘అది మంచి ఏరియాలో ఉందిరా.. వద్దు’ అన్నాడు రమాకాంత్‌. అప్పులు తీర్చమని ఐదు లక్షలు స్నేహితుడి చేతిలో పెట్టాడు. తర్వాత శ్రీధర్‌ ప్లాట్‌కి దగ్గర్లో ఓ సెజ్‌ రావడంతో అతడి భూమి ధర అమాంతం పెరిగింది.

మణి, హరిత, రమాకాంత్‌.. ఈ స్నేహితులే లేకపోతే ఆ ముగ్గురి జీవితాలు తెల్లారిపోయేవే. కుటుంబీకులు, బంధువులు ఇవ్వలేని భరోసాను ఇచ్చి మిత్రుల జీవితాల్ని నిలబెట్టే ఇలాంటి దోస్త్‌లు ఎంతోమంది. ఎక్కువ స్నేహితులున్న వాడి జిందగీ పెట్రోమాస్‌ లైట్‌లా వెలిగిపోతూనే ఉంటుంది. ప్రతీదీ షేరింగ్‌ చేసుకునేవాళ్లుంటే బతుకంతా కేరింగ్‌గానే ఉంటుంది. క్లాస్‌రూమే కార్నివాల్‌ అవుతుంది. పిచ్చాపాటీ మాటలకు వేదికయ్యే క్యాంటీనే స్వర్గానికి అడ్డాగా మారుతుంది. దోస్త్‌లే ఆస్తులుగా ఉన్నవాడు కష్టాలనీ, కన్నీళ్లనీ తేలిగ్గా దాటేయగలడు. ఇన్ని చెప్పినా ‘అసలు ఫ్రెండ్‌ ఎందుకు ఉండాలి?’ అనే అనుమానం మీలో ఇంకా ఉందా? అయితే వినుకోండి.

స్నేహంతో ఆరోగ్యానికి మేలు

పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. కానీ స్నేహం చేయడం మనసుకి, తనువుకి, ఆరోగ్యకరం అంటున్నాయి చాలా అధ్యయనాలు. ఎక్కువ మంది స్నేహితులు ఉన్నవాళ్లకి అనారోగ్య సమస్యలు తక్కువట. ముఖ్యంగా మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ. స్నేహ బంధాలు ఉన్నవాళ్లకి కష్టాలు, కన్నీళ్లు, ఒత్తిళ్లు.. మనసులోనే పెట్టుకొని కుమిలిపోవాల్సిన పని లేదు. అన్నీ పంచుకున్నప్పుడు మెదడులో ఆక్సిటోసిన్‌ స్థాయిలు పెరిగి మనసు తేలిక పడుతుందట. 2010లో అమెరికాలో చేసిన అధ్యయనం ప్రకారం మిగతావారితో పోలిస్తే ఎక్కువ మిత్రులున్నవారు అకాల మరణం పొందడం తక్కువని తేల్చారు.

దోస్త్‌లే గురువులు

వ్యక్తి ఎదుగుతున్న దశలో మంచీచెడూ.. ఏదైనా నూటికి ఎనభైశాతం మంది స్నేహితుల్ని చూసే నేర్చుకుంటాడు. ఆటలు, చదువు, ఉద్యోగం, లక్ష్యాలు, షాపింగ్‌, అభిరుచులు, జీవిత నైపుణ్యాలు.. ప్రతీదీ ఫ్రెండ్స్‌ ద్వారానే అలవరచుకుంటాడు. ఒక్కొక్కరి నుంచి ఒక్కోటి నేర్చుకుంటారు. మనిషి చెడు దారి పట్టడంలో తొంభైశాతం స్నేహితులే కారణమట. ఒకరకంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి ఒకరకమైన జీవనశైలి ఏర్పడటానికి వాళ్లే మార్గదర్శకులు. మంచి స్నేహితులుంటే ఆటోమేటిగ్గా సానుకూలమైన జీవితం గడుపుతామని చెప్పాల్సిన పనిలేదుగా!

మన బలమెంతో తెలుసు

కొన్ని సందర్భాల్లో మన సత్తా ఏంటో మనకు తెలియదు. ఇది చేయగలనా? లేదా? అనే అనుమానం. అలాంటి సంశయంలో ఉన్నప్పుడు మనకన్నా ఎక్కువ ఫ్రెండే మనల్ని నమ్ముతాడు. ‘నువ్వు ఇది చేయగలవ్‌’ అంటూ ముందుకు తోస్తాడు. వెన్నుతట్టి భరోసా ఇస్తాడు. మనల్ని విజేతగా నిలుపుతాడు. ఇంకొన్నిసార్లు ఒక్కో విషయంలో ఎటూ నిర్ణయం తీసుకోలేం. మంచీచెడు తేల్చుకోలేం. అప్పుడు ఫ్రెండ్‌తో ఓ మాట కలిపితే అన్నీ తేటతెల్లం చేస్తాడు. స్పష్టమైన దారి చూపిస్తాడు.

ప్రేమ రాయబారులు

ఓ వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో సగానికిపైగా స్నేహితుల ప్రభావమే ఉంటుందట. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో.. ఫ్రెండ్స్‌ సలహాలు, అభిప్రాయాల కారణంగానే తమకు ఎలాంటి భాగస్వామి కావాలో ఓ నిర్ణయానికి వస్తారు. ఇదికాకుండా ఫ్రెండ్స్‌గా ఉన్న అమ్మాయి, అబ్బాయిలు ప్రేమలో పడి పెళ్లిదాకా వెళ్లడం ఈ కాలంలో సాధారణం. ఇద్దరి మధ్యా రాయబారం నడిపి మిత్రులే పెళ్లి పీటలు ఎక్కించిన సందర్భాలెన్నో. కన్నవాళ్లు ఒప్పుకోని పెళ్లిళ్లకు స్నేహితులు పెద్దలుగా మారిన ఉదంతాలు చూశాం.

భావోద్వేగాల బంధం

భాగస్వామి, పేరెంట్స్‌కి చెప్పుకోలేని ఎన్నో విషయాలు స్నేహితులతో పంచుకుంటాం. ముఖ్యంగా ప్రేమలు, అనుబంధాలు, రహస్యాలు, చేసిన తప్పులు.. ఇవన్నీ మిత్రుడితోనే చెప్పుకునేవాళ్లు ఎక్కువ. దీన్ని బట్టి ఫ్రెండ్‌కి మన జీవితంలో ఎంతటి కీలకమైన స్థానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళన, మానసిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇష్టమైన స్నేహితులు పక్కనే ఉంటే రెట్టింపు వేగంతో కోలుకుంటారని ‘హెల్దీ మూడ్స్‌’ అధ్యయనంలో తేలింది.

ఏరకంగా చూసినా ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహం ఉంటుంది. మనసుల మధ్య పుట్టి మట్టిలో కలిసిపోయేదాకా నిలిచే ఉంటుంది. భుజంపై చెయ్యేసి దగ్గరితనం చాటుకోవడమే కాదు.. కష్టాల్లో ఉన్నప్పుడు భుజం తట్టి నేనున్నా అనే ఫ్రెండ్‌ ఉంటే ఆ స్నేహం నిత్యం పరిమళిస్తూనే ఉంటుంది. అందుకే ఈతరం తప్పకుండా పాడాలి ‘దోస్త్‌ మేరా దోస్త్‌.. తూ హై మేరీ జాన్‌.. ’అని.‘

ఇదీ చదవండి: న్యాయం కోసం ఇంటింటికీ తిరుగుతోంది.. బొట్టు పెట్టి మరీ వేడుకుంటోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.