ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులకు అల్వాల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దష్మంత్ రెడ్డి హకీంపేట డిపో మేనేజర్ సహకారంతో 300 బస్సు పాస్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్థినిలు పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లడం సరికాదని బస్సులో ప్రయాణించడమే ఉత్తమమని పేర్కొన్నారు. ప్రైవేటు వాహనాల కన్నా ఆర్టీసీ బస్సులో వెళ్లడం వల్ల భద్రత ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు అనుకూలంగా బస్సులను నడుపుతామని, స్టాప్ల వద్ద కచ్చితంగా బస్సులు ఆగే విధంగా చర్యలు తీసుకుంటామని మేనేజర్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : కుక్క పిల్లలకు పాలిచ్చిన వరాహం