ETV Bharat / state

మార్కెట్​లో మరో కొత్త మోసం.. 'ప్రీలాంచ్‌'.. రియల్‌ దందా - prelaunch fraud in hyderabad

prelaunch fraud: గాలిలో మేడలు కడుతున్న కొన్ని రియల్‌ ఎస్టేట్ సంస్థలు ప్రీలాంచ్‌ పేరిట సగం ధరకే ఫ్లాటు అంటూ డబ్బులు కట్టించుకొని ముఖం చాటేస్తున్నాయి. గడువు దాటినా ఇదిగో.. అదిగో.. అంటూ మభ్యపెడుతున్నాయి. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పిన ఓ సంస్థకు ఇప్పటికీ అనుమతులు రాలేదని తెలుసుకున్న కొనుగోలుదారులు ఆందోళన బాట పడుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లోని సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థ కార్యాలయం ముందు బాధితులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.

మార్కెట్​లో మరో కొత్త మోసం.. 'ప్రీలాంచ్‌'.. రియల్‌ దందా

author img

By

Published : Jul 31, 2022, 8:28 AM IST

prelaunch fraud: హైదరాబాద్‌లో కొవిడ్​కు ముందు స్థిరాస్తి రంగం దూకుడు మీద ఉన్నప్పుడు కొందరు బిల్డర్లు ప్రీలాంచ్‌ పేరుతో దందాకు తెరతీశారు. అనుమతులు లేకుండానే 'రెరా' నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లను విక్రయించి రూ.కోట్లు ఆర్జించారు. కాకతీయ హిల్స్‌లోని కార్తికేయ పనోరమా, బాచుపల్లిలో ఆనంద్‌ ఫార్చూన్‌ తాజాగా సాహితి ఇన్‌ఫ్రా ఇదే విధంగా వసూళ్లకు పాల్పడ్డాయి.

పైసా పెట్టుబడి లేకుండానే..: చేతిలో చిల్లి గవ్వ లేకున్నా, ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతంలో భూములు చూపించి ఇక్కడ అపార్ట్‌మెంట్‌, వాణిజ్య సముదాయం వస్తుందని.. అందులో ఫ్లాట్‌, వాణిజ్య స్థలం మార్కెట్‌ కంటే అతి తక్కువ ధరకే వస్తుందని కొనుగోలుదారులను నమ్మిస్తున్నారు. సొమ్ము మొత్తం ముందే చెల్లిస్తే చదరపు అడుగు రూ.3వేలు ఉన్న చోట రూ.2వేలు విక్రయించి ఆ మొత్తాన్ని భూ యాజమానికి చెల్లించి అవిభాజ్యపు స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. అనంతరం స్థలం కొన్నవారి నుంచి జాయింట్‌ డెవలప్‌మెంట్‌ కమ్‌ అగ్రిమెంట్‌, జనరల్‌ పవరాఫ్‌ అటార్నీని బిల్డర్‌ రాయించుకొని అనుమతులకు దరఖాస్తు చేస్తే.. మూడేళ్లు వరకు సమయం పడుతుంది. ఈ విషయాన్ని దాచి మూడేళ్లలోనే నిర్మాణాలు చేస్తామంటూ సంస్థలు మభ్యపెడుతున్నాయి.

డబ్బు ఇవ్వాలని నిరసన..

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ సాహితి సర్వనీ ఎలైట్‌ పేరుతో పది టవర్ల నిర్మాణం అంటూ ప్రీ లాంచింగ్‌ కింద మూడేళ్ల కిందట విక్రయాలు ప్రారంభించింది. వందల మంది సంస్థలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. కొవిడ్‌ పరిస్థితులు అంటూ అక్కడ ఎలాంటి పనులు ప్రారంభించలేదు. కొనుగోలుదారులు ‘బాధితులు సంఘం’గా ఏర్పడి శనివారం సంస్థ ప్రతినిధులను నిలదీశారు. సంస్థ చెప్పినంత భూమి లేదని తమ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ వంద మందికిపైగా బాధితులు కార్యాలయం ముందు బైఠాయించారు. ఆగస్టు 6న సంస్థ యజమాని, టీటీడీ బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని సంస్థ ప్రతినిధి విశ్వనాథ్‌ సముదాయించారు. మూడేళ్లుగా సంస్థ మోసం చేస్తోందని, దాదాపు రూ.1500 కోట్లు వసూలు చేసిందని పలువురు పేర్కొన్నారు. అనంతరం బాధితులు అక్కడి నుంచి ఫిర్యాదు చేసేందుకు సీసీఎస్‌కు వెళ్లారు.

* కోకాపేటలో ఓ సంస్థ 7.5 ఎకరాల్లో వాణిజ్య సముదాయం కడతామని చెప్పి.. సుమారు ఆరేడు వందల కోట్లు వసూలు చేసింది. ఐదు అంతస్థులు నిర్మించగా.. ఆరు నెలలుగా పనులు ఆగిపోయాయి.

* ఐటీ కారిడార్‌లో కార్యాలయాల భవనాలను నిర్మించే మరో ఇన్‌ఫ్రా సంస్థ ప్రీలాంచ్‌ పేరుతో 2వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇవీ చూడండి..

అన్నారం గేట్ల వద్ద భారీగా ఇసుక మేట.. 30 గేట్లు తెరవడం కష్టమే..

రిషికి ఇక కష్టమే.. 10శాతానికి పడిపోయిన విజయావకాశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.