ETV Bharat / state

సాఫ్ట్​వేర్ ఉద్యోగాల పేరిట మోసం.. - సాఫ్​వేర్ ఉద్యోగాల పేరిట మోసం..

తాను పనిచేసే సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బుల వసూలు చేసిన నిందితుడిని గోపాలపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎవరైనా ఉద్యోగాల పేరిట డబ్బులు డిమాండ్ చేస్తే తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు.

సాఫ్​వేర్ ఉద్యోగాల పేరిట మోసం..
author img

By

Published : Oct 24, 2019, 8:39 PM IST

Updated : Oct 24, 2019, 10:54 PM IST

కరీంనగర్‌ జిల్లా వావిలాలపల్లికి చెందిన రిషిరెడ్డి అలియాస్‌ హరీష్‌ ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి హెచ్‌ఎంగా పనిచేశారు. కొంతకాలం క్రితం చనిపోయారు. తల్లి ఇరిగేషన్‌ శాఖలో ఉద్యోగిని. రిషిరెడ్డి విలాసాలకు అలవాటుపడి 2016లో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి ప్రముఖులతో సెల్ఫీలు దిగి.. వారితో పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. విప్రో కంపెనీలో టీమ్‌ లీడర్‌గా పనిచేస్తున్నానని, సంస్థలో మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడసాగాడు.

గత ఏడాది జులైలో సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌బజార్‌లోని లాడ్జిలో అద్దెకు దిగాడు. అతడు అక్కడున్న వారిని మంచి చేసుకున్నాడు. విప్రోలో ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడు. లాడ్జి నిర్వాహకుడు సురేష్‌తో పరిచయం కాగా అతడి బంధువులకు ఉద్యోగాలను ఇప్పిస్తానని నకిలీ అపాయిమెంట్‌ ఆర్డర్లను తయారు చేసుకుని వచ్చి ఉద్యోగం వచ్చినట్లు నమ్మించి వారి నుంచి రూ.4 లక్షలు తీసుకున్నాడు. మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని సెల్​ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

సాఫ్ట్​వేర్ ఉద్యోగాల పేరిట మోసం..

ఇవీచూడండి: ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర

Intro:సికింద్రాబాద్ యాంకర్..సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు..కరీంనగర్కు చెందిన రిషి రెడ్డి ఏడో తరగతి వరకు చదువుకున్నారు.అతని తండ్రి స్కూల్ హెడ్మాస్టర్ గా తల్లి నీటిపారుదల శాఖలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..కొన్ని రోజుల క్రితం అతని తండ్రి మరణించినట్లు తండ్రి మరణించిన అనంతరం త్వరగా డబ్బు సంపాదించాలనే కాంక్ష తో 2016లో ఇంటినుండి పారిపోయినట్లు తెలిపారు.. ఆ సమయంలో బయట ప్రముఖ రాజకీయ నాయకులతో సెల్ఫీలు దిగుతూ తాను ఓ ప్రైవేటు కంపెనీలో టీం లీడర్ గా పని చేస్తున్నానని సాఫ్ట్వేర్ ఉద్యోగులు గా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికుతూ కరీంనగర్ నిజాంబాద్ గోదావరిఖనికి చెందిన 50 మంది నిరుద్యోగ నుండి డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు..డబ్బులు తీసుకున్న తదనంతరం ఫోన్లో ఎత్తకుండా ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో అనుమానం వచ్చి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. గత ఏడాది జూలైలో సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ గణేష్ లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు..ప్రముఖులతో తో దిగిన ఫోటోలు చూపిస్తూ స్థానికులను నమ్మించాడు..రాజు కు సంబంధించిన సురేష్ అనే వ్యక్తిని విప్రో కంపెనీ కి తీసుకెళ్లి అక్కడ సెక్యూరిటీ రూమ్లో కూర్చోబెట్టి ఉద్యోగం ఇప్పిస్తానని అతని వద్దనుండి నాలుగు లక్షలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు..బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకుని రిమాండ్కు తరలించారుBody:VamshiConclusion:7032401099
Last Updated : Oct 24, 2019, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.