తమిళనాడు కోరితే చెన్నై తాగునీటి అవసరాల కోసం కేటాయించిన కృష్ణజలాలను ఇచ్చేందుకు సిద్ధమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అంగీకారం తెలిపాయి. కృష్ణానది యాజమాన్య బోర్డు ఛైర్మన్ పరమేశం నేతృత్వంలో చెన్నై తాగునీటి కమిటీ సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది.
నీటి వాటా 15 టీఎంసీల్లో ఇప్పటికే ఆరు టీఎంసీలకు పైగా నీరు విడుదల చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. ప్రస్తుతం తాగునీటికి ఇబ్బంది లేదని.. ఏప్రిల్ నెల నుంచి నీరు ఇవ్వాలని తమిళనాడు కోరింది. ప్రవాహ నష్టాలు లేకుండా పైపులైను వేసుకునే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆ రాష్ట్ర ఇంజనీర్లు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.